E-Paper
Advertisement

మనోజ్- మౌనిక పెళ్లి.. మోహన్ బాబు గురించి నిజాలు బయట పెట్టిన అఖిలప్రియ!

మనోజ్- మౌనిక పెళ్లి.. మోహన్ బాబు గురించి నిజాలు బయట పెట్టిన అఖిలప్రియ!
Advertisement

Akhila Priya:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మంచు ఫ్యామిలీ (Manchu family) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు (mohan babu ).. క్రమశిక్షణకు మారుపేరు.. అలాంటి మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ (Manchu manoj) పై రౌడీల చేత దాడి చేయించారనే వార్తలు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే . ముఖ్యంగా తండ్రీ కొడుకుల వివాదం కోర్టు మెట్లెక్కింది. దీనికి కారణం మంచు మనోజ్.. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలపై తాజాగా మౌనిక (Mounika) సోదరి అఖిల ప్రియా (Akhila priya) చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

మనోజ్ – మౌనిక పెళ్లిపై అఖిల ప్రియ కామెంట్స్..

ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. మంచు మనోజ్ – మౌనిక పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల ప్రియ మాట్లాడుతూ.. “మంచు మనోజ్.. మౌనికను పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని అడిగారు. అయితే ఈ పెళ్లి వెంటనే జరగాలని నేను మనోజ్ తో చెప్పాను. నిజానికి ఈ పెళ్లికి మా ఫ్యామిలీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. పైగా నా తమ్ముడు అటు కెరియర్ పరంగా, నేను పొలిటికల్ పరంగా ఎఫెక్ట్ అవ్వకూడదని త్వరగా పెళ్లి చేసుకోవాలని మాత్రమే మనోజ్ తో చెప్పాము. అలా చెప్పడానికి కారణం మౌనిక మనోజ్ పెళ్లిపై మీడియాలో చాలా కథనాలు వచ్చాయి . పైగా నా తమ్ముడు చిన్నవాడు. పొలిటికల్ గా మేము బిజీగా ఉన్నప్పుడు.. ఈ వార్తలు వల్ల మేము కూడా ఎఫెక్ట్ అయ్యాము. తొందరగా పెళ్లి చేయాలని అనుకున్నామే తప్ప ఎప్పుడైతే వాళ్ళు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారో.. అప్పుడు వాళ్ళ నిర్ణయానికి మేము అడ్డు చెప్పలేదు.

Advertisement

also read:ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన డైరెక్టర్ కేకే ఆఖరి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

 

మోహన్ బాబు రియాక్షన్ పై అఖిల ప్రియ ఏమన్నారంటే?

Advertisement

మోహన్ బాబు మొదట వీరిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదు. నిజానికి ఇద్దరి మధ్య పరిస్థితులు బాగోలేవు. మాకు పెద్ద వాళ్ళు లేరు. పైగా అది మోహన్ బాబు గారి కుటుంబానికి అదనపు బాధ్యత అవుతుంది. ఇవన్నీ వాళ్లు కూడా ఆలోచిస్తారు కదా.. తల్లిదండ్రులు అంత ఈజీగా ఒప్పుకుంటే ప్రపంచంలో ఇక ఇబ్బందులే ఉండవు కదా అంటూ అఖిల ప్రియ చెప్పుకొచ్చింది . మోహన్ బాబు కుటుంబానికి కొన్ని పద్ధతులు ,సాంప్రదాయాలు ఉంటాయి.. అలా అని వారిని తప్పు పట్టలేం.. ఇలా అని మౌనిక – మనోజ్ ల నిర్ణయాన్ని తప్పు పట్టడానికి లేదు. కాకపోతే కాలం అన్నింటిని నిర్ణయిస్తుందని నేను నమ్మాను.. అంటూ అఖిల ప్రియ చెప్పుకొచ్చింది ప్రస్తుతం వీరి పెళ్లిపై ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మంచు మనోజ్ – మౌనిక పెళ్లి..

మంచు మనోజ్ – మౌనిక రెడ్డిల వివాహం ఫిలింనగర్ లోని మంచు లక్ష్మీ నివాసంలో జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. 2023 మార్చి మూడవ తేదీన రాత్రి 8:30 నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా మనోజ్.. మౌనిక మెడలో మూడు ముళ్ళు వేశారు. ఇక ఈ వేడుకకు మోహన్ బాబు ఆయన సతీమణితో పాటు మంచు విష్ణు ఆయన సతీమణి అలాగే అఖిల ప్రియ కుటుంబ సభ్యులు కూడా సందడి చేశారు.

Related News

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

Big Stories

Advertisement
×