Earthquake: ఈ మధ్య కాలంలో వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల థాయ్‌లాండ్, మయన్మార్ ప్రాంతాల్లో భూకంపాలు అల్లకల్లోలం సృష్టించాయి. ఆ తరువాత పసిఫిక్ మహాసముద్రంలో ఉంన్న టోంగా దీవులలో కూడా భూమి కంపించింది. ఈరోజు ఉదయం పసిఫిక్ మహాసముద్రంలోని పపువా న్యూ గునియాలో కూడా భూకంపం వచ్చింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. అంతేకాకుండా భూ కంపం ప్రభావం వల్ల అక్కడ సునామీ వచ్చే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాలలో ఉన్న ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఈ ఘటనలను మరువక ముందే ఆసియా ఖండంలో మరోసారి భూకంపం వచ్చింది. ఈ రోజు మధ్యహ్నం పాకిస్థాన్‌లో భూకంపం వచ్చింది.
ALSO READ: మరోసారి ప్రకృతి ప్రకోపం
ఇస్లామాబాద్ సమీపంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమికి 10 కి.మీ లోతులో నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు సమాచారం.
ఒక్క సారిగా భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొద్దిసెపటి వరకు భూమి కంపిస్తూనే ఉంది. ఆ తరువాత పరిస్థితి సద్దుమనగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే పాకిస్థాన్‌లో వచ్చిన భూకంపం వల్ల జమ్ముకశ్మీర్‌లో కూడా భూమి కంపించింది.