BigTV English

Dates: పచ్చి ఖర్జూరాలు తినకూడదా..? వీటిని కొనడానికి బెస్ట్ ప్లేస్ ఏదో తెలుసా..?

Dates: పచ్చి ఖర్జూరాలు తినకూడదా..? వీటిని కొనడానికి బెస్ట్ ప్లేస్ ఏదో తెలుసా..?

Dates: ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎనీమియా సమస్య నుంచి తప్పించుకోవడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయట. ఖర్జూరాలలో కేలరీలు అధికంగా ఉంటాయట. అందుకే బరువు తగ్గలనుకునే వారు వీటిని ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.


వీటిలో ఉండే ప్రోటీన్స్ ఇతర పోషకాలు కండరాలను బలంగా చేస్తాయట. ఖర్జూరాలు కాల్షియం, ఫాస్ఫరస్, ఇతర ఖనిజాలకు మంచి మూలం. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే పొటాషియం బీపీని తగ్గించేందుకు కూడా హెల్ప్ చేస్తుందట. అందుకే వీటిని డైట్‌లో చేర్చుకోవడం మంచిది. సాధారణంగా అయితే చాలా మంది పండుగా ఉండే ఖర్జూరాలనే తింటారు. పచ్చి ఖర్జూరాలు కూడా ఉంటాయని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అయితే వీటిని తింటే ఆరోగ్యానికి ఏమైనా హాని జరుగుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ALSO READ: అరటి పండు తొక్కతో పాటు తింటే ఏం జరుగుతుంది..?


సూపర్ మార్కెట్‌లలో, షాపులలో దొరికే ఖర్జూరపండ్లతో పోలిస్తే ఇవి చాలా భిన్నంగా ఉంటాయి. ఈ ఖర్జూరాలను సాధారణంగా పక్వానికి వచ్చే ప్రారంభ దశలలోనే కోసి మార్కెట్‌కు తరలిస్తారు.

పచ్చి ఖర్జూరాలు తినడం సురక్షితమేనా?
పచ్చి ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు సహాయపడుతుందట. వీటిలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, నెచురల్ షుగర్స్ అధికంగా ఉంటాయి. అయితే ఎండిన ఖర్జూరాల కంటే వీటిని చాలా తక్కువగా ప్రాసెస్ చేస్తారు. అందుకే వాటిని తినడానికి ముందు బాగా కడగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కడ కొంటే బెటర్..?
పచ్చి ఖర్జూరాలు సాధారణంగా ప్రాంతాన్ని బట్టి జూన్, ఆగస్టు మధ్య అందుబాటులో ఉంటాయట. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, తిరుపతి వంటి నగరాల్లో అధికంగా లభిస్తాయి. అంతేకాకుండా పచ్చి ఖర్జూరాలు వేసవి ప్రారంభంలో కూడా పండ్ల దుకాణాలలో కనిపిస్తాయి.

వీటితో పాటు బిగ్‌బాస్కెట్, జియోమార్ట్‌లలో లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలనుకుంటే అమెజాన్ ఇండియాలో కూడా పచ్చి ఖర్జూరాలను తీసుకోవచ్చు.

పంట కోత సమయంలో, వ్యాపారులు రహదారి పక్కన లేదా పొలాల దగ్గర పచ్చి ఖర్జూరాన్ని అమ్మడం సర్వసాధారణం. అంతేకాకుండా ఖర్జూరం పండించే ప్రాంతాలలో రైతుల నుండి నేరుగా కొనుక్కోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Anjeer: వీళ్లు.. అంజీర్‌లను అస్సలు తినకూడదు తెలుసా ?

Dasara festival 2025: నవరాత్రి పండుగకు స్పెషల్ వంటలు.. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ప్రత్యేక రెసిపీలు

Heart Attack: వ్యాయామం చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? హార్ట్ ఎటాక్ కావొచ్చు !

Healthy Hair Tips: ఆరోగ్యమైన జుట్టు కోసం సహజ చిట్కా.. వారంలో రెండు సార్లు చాలు

Glowing Skin Tips: కెమికల్స్ లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్.. ఇలా చేస్తే చందమామలా మెరిసే చర్మం

Yoga For Brain Health: ఈ యోగాసనాలతో.. బ్రెయిన్ డబుల్ షార్ప్ అవుతుందట !

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ వంటలు ఆరోగ్యానికి ఇంత మంచివా? అస్సలు ఊహించి ఉండరు!

Alcohol: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!

Big Stories

×