BigTV English

Elon Musk 1 Million dollar: డైలీ ఒకరికి రూ.8 కోట్లు ఇస్తా.. అమెరికా ఎన్నికల ప్రచారంలో మస్క్ సంచలన ప్రకటన

Elon Musk 1 Million dollar: డైలీ ఒకరికి రూ.8 కోట్లు ఇస్తా.. అమెరికా ఎన్నికల ప్రచారంలో మస్క్ సంచలన ప్రకటన

Elon Musk 1 Million dollar| అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు మరి కొన్ని రోజుల్లో జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల బరిలో ఉండగా.. ఆయనకు పోటీగా డెమొక్రాట్స్ పార్టీ తరపున వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పోటీ చేస్తోంది. అమెరికా మీడియా నిర్వహించిన సర్వేలలో ఇద్దరి మధ్య హోరీహోరీ పోటీ నెలకొంది. కానీ డొనాల్డ్ ట్రంప్ తరపున ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ప్రచార కార్యక్రమాల్లో డాన్సులు కూడ చేశారు. తాజాగా ట్రంప్ తరపున ప్రచారం చేస్తూ.. అమెరికా రాజ్యాంగానికి మద్దతుగా తాను వేసిన పిటీషన్ కు సైన్ చేసిన వారిలో ఒక వ్యక్తికి రోజూ ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ.8 కోట్లు) ఇస్తానని ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు సంచలనంగా మారాయి.


అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024న జరుగనున్నాయి. అంటే మరో 16 రోజులపాటు ఎలన్ మస్క్ మొత్తం 16 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. శనివారం అక్టోబర్ 19, 2024న ఎలన్ మస్క్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఒక వ్యక్తి మస్క్ పిటీషన్ పైన సైన్ చేశాడు. ఆ వ్యక్తికి అందరి ముందు మస్క్ ఒక మిలియన్ డాలర్ల్ చెక్ అందించాడు. ఆ తరువాత తాను ఇలాగే ప్రతిరోజు పిటీషన్ కు సమర్థిస్తూ సైన్ చేసే ఒక వ్యక్తికి మిలియన్ డాలర్లు అందిస్తానని చెప్పాడు.

Also Read: రాజకీయాలను జయించిన ప్రేమ.. పాక్ యువతిని పెళ్లాడిన బిజేపీ నాయకుడి కుమారుడు..


మిలియన్ డాలర్ల చెక్ అందుకున్న మొదటి వ్యక్తి జాన్ డ్రెహర్. ఇతను పెన్సిల్ వేనియా రాష్ట్రానికి చెందినవాడు. అంతను ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ ప్రచార కార్యక్రమాల్లో నిర్విహించే ర్యాలీలో పాల్గొన్నాడు.

ట్రంప్‌నకు మద్దతుగా బహిరంగ ప్రచారం చేస్తున్న ఎలన్ మస్క్
మిలియన్ డాలర్ల చెక్ అందిస్తూ ఎలన్ మస్క్ ఇలా మాట్లాడారు. “నాకు ఈ చెక్ ఎవరికి ఇవ్వబోతున్నానో అసలు తెలియదు. ఏదో ర్యాండమ్ గా ఇతనికి ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో వచ్చేవారందరినీ స్వాగతిస్తున్నాను.” అని చెప్పాడు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో ఆయనకు మద్దతుగా ఎలన్ మస్క్ భారీగా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. అయితే ఎలన్ మస్క్ వద్ద ఉన్న ధనాన్ని కేవలం ప్రతర్థి కమలా హ్యారిస్ ను ఓడించడానికే ట్రంప్ ఉపయోగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.

ట్రంప్ తరపున ప్రచారం కోసం అమెరికా పిఎసి అనే సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థను ఎలన్ మస్క్ ప్రారంభించడం విశేషం. ఈ అమెరికా పిఎసి ప్రచార సంస్థ.. అమెరికాలోని పలు కీలక రాష్ట్రాల్లో ఓటర్లను ట్రంప్ వైపు ఆకర్షించడం కోసం కృషి చేస్తోంది. అమెరికా పిఎసి కోసం ఎలన్ మస్క్ భారీ ఖర్చు పెడుతున్నట్లు అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఈ కీలక రాష్ట్రాల్లో కమలా హ్యారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ ఉండడంతో అమెరికా పిఎసి వ్యూహాలు ఫలిస్తాయా? లేదా? అనేది కీలకంగా మారింది.

ఇప్పటివరకు ఎలన్ మస్క్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం కోసం 7.5 కోట్ల డాలర్ల కంటే అధికంగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ ఖర్చు పెట్టిన వ్యక్తిగా ఎలన్ మస్క్ రికార్డు సృష్టించారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×