Elon Musk H-1B Visa | అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఎలన్ మస్క్ ఓ కింగ్ మేకర్. జనవరి 2025లో ఏర్పాటు కాబోతున్న కొత్త ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు ఇప్పటికే కీలక పదవి అప్పగించారు. నవంబర్ 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం ఎలన్ మస్క్ అహర్నిశలు శ్రమించారు. వందల కోట్లను నీటిలా ఖర్చు పెట్టి ఎన్నికల ప్రచారం చేశారు.
ఇప్పుడు ట్రంప్ విజయం తరువాత ఆయన పై సొంత ట్రంప్ అభిమానులే మండిపడుతున్నారు. దీనంతటికీ కారణం అమెరికాలోని హెచ్ వన్ బి వీసా. నైపుణ్యం కలిగిన విదేశీయులకు అగ్రరాజ్యం అమెరికా ఈ వీసా జారీ చేస్తుంది. కానీ అమెరికాలో విదేశియులు వచ్చి ఈ వీసాలతో స్థిరపడిపోతున్నారని.. వారు రావడం వల్ల అమెరికన్లు నిరుద్యోగులుగా మారిపోతున్నారని ఒక వర్గం వాదిస్తోంది. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఈ వీసాలు జారీ చేయకూడదని చెప్పారు. ఆ తరువాత వీసా సంఖ్యను భారీ తగ్గించారు.
కానీ 2020 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడంతో అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం ఈ హెచ్ వన్‌బి వీసాలను జారీ చేయడం కొనసాగించింది. మరోవైపు తాజాగా ట్రంప్ ఎన్నికల్లో గెలవడంతో హెచ్ వన్‌బి వీసాల గొడవ మళ్లీ మొదలైంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ వలసదారులపై ఆంక్షలు విధిస్తానని కఠినంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ మద్దతుదారులు, ఎలన్ మస్క్ మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతోంది.
దీనికి కారణం.. హెబ్ వన్‌బి వీసా దారులకు ఎలన్ మస్క్ మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్ ప్రధాన ఆదాయం ఈ హెబ్ వన్‌బి వీసాల హోల్డర్ల ద్వారానే వస్తోంది. మస్క్ కు చెందిన టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల్లో హెబ్ వన్‌బి వీసాలు కలవారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి నైపుణ్యంతోనే మస్క్ కంపెనీలు నడుస్తున్నాయి. దీంతో ఎలన్ మస్క్ హెబ్ వన్‌బి వీసాల తొలగించడం లేదా కఠినతరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయనతో పాటు ట్రంప్ కేబినెట్ లో మరో ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి కూడా హెబ్ వన్‌బి వీసాల తొలగించేస్తే.. అమెరికాకు ఆర్థికంగా చాలా నష్టమని అభిప్రాయపడ్డారు.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
అయితే ట్రంప్ మద్దతుదారులైన మాగా గ్రూపులో మారియో నవ్‌ఫాల్ అనే వ్యక్తి హెబ్ వన్‌బి వీసాల అంశంపై ఎలన్ మస్క్ తీరును తప్పుబడుతూ ట్విట్టర్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశాడు. అసలు హెబ్ వన్‌బి వీసాలే ఉండకూడదంటే.. వాటిని ఇంకా పెంచాలని ఎలన్ మస్క్ ప్రయత్నిస్తున్నాడు. అతడికి మతి పోయిందా? అని రాశాడు. ఈ పోస్ట్ ని ఒక యూజర్ ఎలన్ మస్క్ కు ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశాడు.
దీంతో ఎలన్ మస్క్ వెంటనే స్పందించారు. “నువ్వు కాస్త వెనక్కు తగ్గు. (ఫ..*క్ ఆఫ్). అవసరమైతే హెబ్ వన్‌బి వీసాల కోసం యుద్ధం చేస్తా. నీ లాంటి వారు ఊహించలేరు. నేను ఎంతకైనా పోరాడుతాను. నేను అమెరికాలో ఉండడానికి కారణం హెబ్ వన్‌బి వీసా. నాలాంటి చాలా మంది ప్రజలు స్పేస్ ఎక్స్, టెస్తా లాంటి వందల కంపెనీలు సృష్టించి అమెరికాకు బలం చేకూర్చారు. ఇదంతా హెచ్ వన్‌బి వీసాల వల్లే సాధ్యమైంది.” అని మస్క్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఇది జరిగిన తరువాత ట్రంప్ కూడా తన విధానాన్ని అనూహ్యంగా మార్చుకోవడం మరో విశేషం. న్యూయార్క్ పోస్ట్ మీడియాతో ఒక టెలిఫోనిక్ ఇంటర్‌వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను హెబ్ వన్‌బి వీసాలకు వ్యతిరేకం కాదని చెప్పారు. తన కంపెనీల్లో కూడా చాలా మంది హెబ్ వన్‌బి వీసాల ద్వారా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. హెబ్ వన్‌బి వీసా కలిగిన వారిలో అత్యధికంగా భారతీయులే ఉండడం గమనార్హం.