Nitish Kumar Reddy father: ఆస్ట్రేలియాలోని మేల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగోవ టెస్టు మూడవరోజు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ తో సత్తా చాటిన విషయం తెలిసిందే. భారత జట్టు కష్టాలలో ఉన్న సమయంలో తన అద్భుత సెంచరీ తో జట్టును ఆదుకున్నాడు నితీష్. దీంతో అతనిపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. అతడు సెంచరీ చేసిన సమయంలో నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి ఎంతో ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
Also Read: Koneru Humpy: ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా కోనేరు హంపి
అయితే అతను సెంచరీ తో అదరగొట్టిన సమయంలో కామెంట్రీ బాక్స్ లో ఉన్న దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు స్టాండింగ్ ఓవేషన్ తో అభినందించాడు. అనంతరం మ్యాచ్ బ్రేక్ సమయంలో నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి కామెంట్రీ బాక్స్ లో ఉన్న సునీల్ గవాస్కర్ ని కలిశాడు. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు ముత్యాల రెడ్డి. దీంతో వెంటనే ముత్యాల రెడ్డిని పైకి లేపి ఆలింగనం చేసుకున్నాడు సునీల్ గవాస్కర్.
ఈ సందర్భంగా గవాస్కర్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ.. ” ముత్యాల రెడ్డి త్యాగాల వల్ల భారత జట్టుకు వజ్రం లాంటి ఆటగాడు దొరికాడు. అతను ఎంతగా కష్టపడ్డాడో మనకు తెలుసు. ముత్యాల రెడ్డి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇవన్నీ వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి” అని పేర్కొన్నాడు గవాస్కర్. అయితే ముత్యాల రెడ్డి గవాస్కర్ కాళ్ళకి నమస్కారం చేస్తున్న సమయంలో కామెంట్రీ బాక్స్ లో ఉన్న మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, మార్క్ నికోలస్.. కామెంట్రీ చేస్తూ ఇది భారత సాంప్రదాయం అని కొనియాడారు.
ఇక నితీష్ కుమార్ రెడ్డి సోదరి కూడా సునీల్ గవాస్కర్ పాదాలను తాకింది. ఈ సందర్భంగా నితీష్ గురించి మాట్లాడుతూ.. అతను ఓ వజ్రమని కితాబ్ ఇచ్చాడు సునీల్ గవాస్కర్. ఇక మూడవ రోజు మ్యాచ్ ముగిసిన అనంతరం నితీష్ కుమార్ రెడ్డిని డ్రెస్సింగ్ రూమ్ లో తన తల్లిదండ్రులు కలిసి భావోద్వేగానికి గురైన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనంతరం తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీని తన కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా కలిసి ఫోటో దిగారు నితీష్ మరియు అతని కుటుంబ సభ్యులు.
ఏ మాత్రం అంతర్జాతీయ క్రికెట్ లో అనుభవం లేకున్నా.. ఆస్ట్రేలియా సీనియర్ బౌలర్లను ఎదుర్కొని సెంచరీ తో జట్టును మ్యాచ్ లో మళ్లీ పోటీలోకి తెచ్చిన నితీష్ రెడ్డిని దిగ్గజ ఆటగాళ్లు సైతం అభినందనలతో ముంచేత్తుతున్నారు. ఇక ఈ సెంచరీ తో హీరోగా మారిన నితీష్ కెరీర్ గురించి, అతని ఇష్టాఇష్టాల గురించి వెతకడం మొదలుపెట్టారు క్రీడాభిమానులు. అయితే నితీష్ క్రికెట్ తో పాటు సినిమా లవర్ కూడా.
Also Read: Pro Kabaddi League 2024 Final: నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్..ఎప్పుడు, ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?
అతను తెలుగు సినిమాలనే ఎక్కువగా చూస్తాడట. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే నీతిష్ కి చాలా ఇష్టమట. ఈ విషయాన్ని నితీష్ కూడా పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. అంతేకాదు ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా మహేష్ బాబుతో దిగిన ఫోటోని షేర్ చేశాడు నితీష్. నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి కి మహేష్ బాబు తండ్రి, దివంగత నటుడు కృష్ణ అంటే చాలా ఇష్టమట. దాంతో మహేష్ బాబు సినిమాలను నితీష్ ఎక్కువగా చూస్తూ అతనికి పెద్ద అభిమాని అయ్యాడు.
Nitish Kumar Reddy’s family meet the great Sunil Gavaskar @abcsport #AUSvIND pic.twitter.com/hUBOghxM2e
— Ben Cameron (@BenCameron23) December 29, 2024