Baba Vanga Prophecy : రాబోయే కాలంలో ఏం జరగుబోతోందో ముందుగానే చూడగలిగే శక్తి ఈ ప్రపంచంలో కొందరు కలిగి ఉన్నట్లు చరిత్రలో, ఇతిహాసాలలో కొన్ని కథలున్నాయి. ఆధునిక చరిత్ర తీసుకుంటే ఫ్రాన్స్ ఆస్ట్రాలజర్ నాస్ట్రడామస్ ఇందుకు ఫేమస్. అయితే ఆయనకు సమానంగా ఒక ముసలి అవ్వ కూడా భవిష్య వాణి చెప్పడంలో ప్రాచుర్యం పొందింది. ఆమె పేరు వ్యాన్‌జెలియా పాండేవా గుష్‌టెరోవా. అయితే ఆమెను అందరూ బాబా వంగా అని పిలుస్తారు. 1996 సంవత్సరంలో బాబావంగా మరణించింది. బల్గేరియాకు చెందిన ఈమె చిన్నతనంలోనే చూపు కల్పోయినా 85 ఏళ్ల వయసు వరకు క్రియాశీలకంగా ఉండేది. ఆమె జీవితకాంలో చెప్పిన జోస్యాలు తూచ తప్పకుండా నిజమయ్యాయి. దీంతో ఆమెను నోస్ట్రడమస్ ఆఫ్ బాల్కన్స్ అని అంటారు.
బాబా వంగాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు బాల్యంలో ఆమెకు ప్రమాదవశాత్తు ఆమె కంటి చూపు కోల్పోయింది. కానీ ఆ సమయంలోనే ఆమెకు భవిష్యత్తు చూడగలిగే శక్తి ఉందని వచ్చిందని కథనాలు ఉన్నాయి. మొదట్లో ఆమె చెబుతున్న విషయాల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత ఆమె బల్గేరియాలో అనతికాలంలోనే ప్రసిద్ధి గాచింది. ఆమెను కలుసుకునేందుకు ప్రజలు బారులు తీరే వారు. అయినా ఆమె ప్రాచుర్యం యూరోప్ దేశాల వరకే పరిమితమైంది. కానీ 1996లో ఆమె చనిపోయిన తరువాత ఆమె గతంలో ప్రపంచం గురించి చెప్పిన భవిష్య వాణి ఘటనలు అన్నీ నిజమవుతూ వచ్చాయి. ఈ ఘటనల్లో అన్నింటి కంటే పెద్దది 2001 సెప్టెంబర్ 1న అమెరికా న్యూయార్క్ లో జరిగిన ట్విన్ టవర్స్ ఘటన. అగ్రరాజ్యంలో జరిగే ఈ ఘటనతో ప్రపంచంలో యుద్ధాలు, వినాశనం మొదలవుతుందని ఆమె జీవించి ఉన్నప్పుడే జోస్యం చెప్పారు.
2025 సంవత్సరం గురించి కూడా ఆమె మృత్యువు, వినాశనం అని పదాలు ఉపయోగించారు. 2025 సంవత్సరానికి గాను ఆమె చేసిన భవిష్యవాణి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు చాలా మంది ఆత్రుతగా ప్రయత్నిస్తున్నారు. అయితే బాబా వంగా చేసి జోస్యాల ప్రకారం.. 2025లో జరిగే అంతర్జాతీయ రాజకీయాల పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర ప్రభావం చూపుతాయి.
Also Read: దేశంలో జోరుగా సాగుతున్న రహస్య బిజినెస్.. ప్రేమ వివాహాలే టార్గెట్
యూరోప్ వినాశనం ప్రారంభం
ఆంగ్ల పత్రిక డైలీ స్టార్ లో ప్రచురితమైన కథనం ప్రకారం.. బాబా వంగా 2025లో యుద్ధాలు జరుగుతాయని, భారీ వినాశనం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు కూడా యుద్ధ ప్రభావం నుంచి తప్పించుకోలేవని ఆమె హెచ్చరించారు. “సిరియా పతనం కాగానే తూర్పు, పశ్చిమ దేశాల మధ్య మహాయుద్ధం మొదలవుతుంది. 2025 స్పింగ్ కాలం (మార్చి నెల చివరి నుంచి జూన్ వరకు)లో యుద్ధం మొదలవుతుంది. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. భూగోళంలోని తూర్పు భాగంలో జరిగే యుద్ధం కారణంగా పశ్చిమ దేశాల నాశనమవుతాయి. ఈ యుద్ధంలో విజయం సాధించిన వారికే సిరియా చెందుతుంది. కానీ విజయం ఒకరిది కాదు సమూహానిది అవుతుంది.” అని బాబా వంగా చెప్పిన మాటలు రికార్డుల్లో ఉన్నాయి.
1996లో చనిపోయిన బాబా వంగా 2024-25లో జరిగిన, జరిగే ఘటనలు గురించి చెప్పారు. ఈ రోజు మనమంతా కళ్లారా ఆ ఘటనలు జరుగుతున్నట్లు చూస్తున్నాం. జ్యోతిష్యం, భవిష్య వాణి గురించి సైన్స్ ని నమ్మేవారు విశ్వసించారు. కానీ కళ్ల ముందు సిరియా తాజాగా కూలిపోవడం చూశాం. పైగా రష్యా, ఉక్రెయిన్, యూరోప్ దేశాల కూటమి మధ్య జరుగుతున్న యుద్ధం, ఇజ్రాయెల్ తన పొరుగు దేశాల్లో చేస్తున్న మారణకాండ యావత్ ప్రపంచం వీక్షిస్తోంది. దీంతో బాబా వంగా భవిష్య వాణిని తోసిపుచ్చలేం.
గ్రహాంతర వాసులతో సంప్రదింపులు
2025 తరువాతనే మానవులు గ్రహాంతర వాసులతో సంప్రదిస్తారని, దీని వల్లే ప్రపంచంలో సంక్షోభం లేదా యుగాంతం మొదలవుతుందని ఆమె చెప్పారు. తాజాగా అమెరికా తదుపరి అధ్యక్షుడు కూడా అమెరికా శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసుల గురించి చేసిన ప్రయోగాల సమాచారం ప్రపంచం ముందుకు తీసుకొస్తానని చెప్పారు. వీటిని బట్టి చూస్తుంటే బాబా వంగా చేసిన జోస్యాలు కచ్చితంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మానవులు టెలిపతిని సాధిస్తారు
మానవులు 2025 సంవత్సరంలో టెలీపతి టెక్నాలజీని అభివృద్ధి చేస్తారని.. టెలిపతి టెక్నాలజీతో మానవులు బయటికి మాట్లాడకుండానే మెదడు నుంచి సంకేతాలతో సంప్రదింపులు చేస్తారని చెప్పింది. ప్రస్తుతం ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్‌కు చెందిన కంపెనీ బ్రెయిన్ చిప్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది. ఇది దాదాపు చివరి దశలో ఉంది. ఈ బ్రెయిన్ చిప్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. మనుషులు టెలిపతిని సాధించినట్లే. వీటితో పాటు నానో టెక్నాలజీ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది.
అయితే ఈ అత్యాధునిక టెక్నాలజీలు దురపయోగం అయితే వినాశనం తప్పదని కూడా బాబా వంగా జోస్యాలు చెప్పారు.