BigTV English

Elon Musk : ఇండియాకు UNSCలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం.. ఎలాన్ మస్క్ ట్వీట్..

Elon Musk : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఐక్యరాజ్యసమితి పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎన్ఓ, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు చేయల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా భద్రతా మండలి లో ఇండియాకు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ విమర్శలు చేశారు.

Elon Musk : ఇండియాకు UNSCలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం..  ఎలాన్ మస్క్ ట్వీట్..

Elon Musk : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఐక్యరాజ్యసమితి పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎన్ఓ, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు చేయల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా భద్రతా మండలి(United Nations Security Council) లో ఇండియాకు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ విమర్శలు చేశారు.


యూఎన్ఓ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఇటీవల ఎక్స్‌ లో ఓ పోస్ట్‌ చేశారు. ఏ ఆఫ్రికా దేశానికీ భద్రతా మండలి(UNSC)లో శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్నారు. గత 80 ఏళ్ల కిందటి మాదిరిగా ఇప్పుడు కొనసాగకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో భద్రతా మండలిలో దేశాల శాశ్వత సభ్యత్వంపై చర్చ మొదలైంది.

ఈ పోస్ట్‌కు అమెరికాకు చెందిన పెట్టుబడిదారు మైఖెల్‌ ఐసెన్‌బర్గ్‌ బదులిచ్చారు. మరి ఇండియా సంగతేంటీ?’ అని ప్రశ్నించారు. యూఎన్‌ఓ మరియు దాని అనుబంధ సంస్థల్లో మార్పులు చేయల్సిన అవసరం ఉందని ఎలాన్‌ మస్క్‌ పేర్కన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం ఇండియా అని గుర్తు చేశారు. ఇండియాకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదమన్నారు.


ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో యూఎన్‌ఓ ఆవిర్భవించింది. దీనికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి డబ్భై సంవత్సరాలు దాటింటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా బ్రిటన్‌, రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్‌ దేశాలే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా ప్రయత్నిస్తుంది. అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు జరగలేదు.

Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×