BigTV English

Florida woman came to Chandigarh: పబ్‌జీ ప్రియుడి కోసం, ఫ్లోరిడా నుంచి చండీఘర్‌కు యువతి..

Florida woman came to Chandigarh: పబ్‌జీ ప్రియుడి కోసం, ఫ్లోరిడా నుంచి చండీఘర్‌కు యువతి..

Florida woman came to Chandigarh: చాలా మంది భారతీయ యువకులు చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తారు. వీలు కుదిరితే అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ఇప్పటివరకు చూశాం. కానీ ఓ అమ్మాయి విదేశాల నుంచి తన ప్రియుడి కోసం ఇండియాకు వచ్చింది. ఆసక్తి రేపుతున్న ఈ వ్యవహారం యూపీలో వెలుగుచూసింది.


పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు బ్రూక్లిన్. వయస్సు మూడు పదులు. అయితే ఏంటని అనుకుం టున్నారా? అక్కడికే వచ్చేద్దాం. ఈమె సొంతూరు అమెరికాలోని ఫ్లోరిడా. పబ్‌జీ గేమ్‌లో ఈమెకి యూపీలోని ఎటావాకు చెందిన యువకుడు హిమాన్షుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహం.. ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. ఇందులో కొత్తేమీ లేదు. కాకపోతే ప్రియుడు కోసం ఏకంగా ఫ్లోరిడా నుంచి భారత్‌కు వచ్చింది ఆ అమ్మాయి.

ఇదంతా కొన్ని నెలల కిందట జరిగింది. ప్రియుడ్ని కలుసుకునేందుకు బ్రూక్లిన్ కొన్ని నెలల కిందట చండీఘడ్‌కు చేరుకుంది. తన కోసం వచ్చిన ఆమెని కలుసుకునేందుకు ఎటావాకు చెందిన యువకుడు హిమాన్షు యాదవ్ అక్కడికి వెళ్లాడు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులపాటు చండీఘడ్‌లో ఉండి అక్కడి నుంచి యూపీలోని ఎటావాకు చేరుకుంది ఈ జంట.


విదేశీ యువతితో హిమాన్షును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం ఊరా వాడా తెలియడంతో మళ్లీ చండీఘడ్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. అప్పటికే పోలీసుల నుంచి సమాచారం రావడంతో డ్రైవర్ నేరుగా తీసుకెళ్లి బస్సును పోలీసుస్టేషన్ ముందు ఉంచాడు. వెంటనే పోలీసులు బ్రూక్లిన్-హిమాన్షును అదుపులోకి తీసుకుని విచారించారు.

ALSO READ: తెలుగోడా మజాకా.. అమెరికాకు ఇండియన్ ట్రీట్మెంట్

ఇందులో యువకుడి తప్పులేదని, యువతి అంగీకారంతో వీరి మ్యారేజ్ జరిగిందని పోలీసులు చెప్పారు. ఇద్దరు కలిసి చండీఘడ్‌ వెళ్లాలన్నది ఆమె నిర్ణయమేనని తెలిపారు. దీంతో బ్రూక్లిన్-హిమాన్షు లవ్‌కు ఫుల్‌స్టాప్ పడింది. ఇదేకాదు.. కొద్దిరోజుల కిందట పాకిస్థాన్‌కి చెందిన సీమాహైదర్ కూడా స్టోరీ ఇలాంటిదే. పబ్‌జీ ద్వారా యూపీకి చెందిన సచిన్‌మీనా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత యూపీ వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకుంది. ఒకప్పుడు భారతీయ యువకుడు విదేశాలకు వెళ్లి అక్కడి వాళ్లను మ్యారేజ్ చేసుకుంటే.. అక్కడి వాళ్లు ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకోవడం గమనార్హం.

 

Tags

Related News

Musk Vs Ellison: మస్క్ ని మించిన మొనగాడు.. ప్రపంచ నెంబర్-1 కుబేరుడు అతడే

Nepal: నేపాల్‌లో ఇంకా కర్ఫ్యూ.. ఖైదీలపై సైన్యం కాల్పులు, మాజీ ప్రధాని ఇంట్లో నగదు, బంగారం సీజ్?

Donald Trump: ఇజ్రాయెల్, ఖతార్ వార్..! బెడిసికొట్టిన ట్రంప్ డబుల్ గేమ్

Charlie Kirk: అమెరికాలో రాజకీయ హింస.. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ హత్య, నిందితులెవరు?

Pushpa – Trump: ‘పుష్ప’ తరహాలో ఆ దేశానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్.. ఇలా తయారయ్యావేంటి మామ!

Nepal Crisis: నేపాల్ ఆర్మీ వార్నింగ్.. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు, కొత్త ప్రధాని ఆయనే?

Big Stories

×