BigTV English

Gabriel Attal | ఫ్రాన్స్ ప్రధాన మంత్రిగా గాబ్రియల్ అట్టల్.. ఓ స్వలింగ సంపర్కుడు!

Gabriel Attal | ఫ్రాన్స్‌లో రాజకీయ ఒడిదొడుకుల కారణంగా ప్రధాన మంత్రి ఎలిజెబెత్ బోర్న్ రాజీనామా చేశారు. ఆమె స్థానంలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మానుయెల్ మెక్రాన్ కొత్త ప్రధాన మంత్రిగా గాబ్రియల్ అట్టల్‌ని నియమించారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. దీంతో ఫ్రాన్స్ దేశ అతి పిన్న వయసు ప్రధాన మంత్రిగా గాబ్రియల్ చరిత్ర సృష్టించారు.

అయితే గాబ్రియల్ అట్టల్ గతంలో తాను ఒక గే(స్వలింగ సంపర్కుడు)నని ప్రకటించారు. ఒక స్వలింగ సంపర్కుడిగా ఫ్రాన్స్ ప్రధాని పదవి చేపట్టడంతో కూడా ఆయన మరో రికార్డ్ సృష్టించారు. గాబ్రియల్ 1989లో జన్మించాడు. ఆయన తండ్రి ఓ యూదు మతానికి చెందినవాడు. ఆయన తల్లికి గ్రీకు, రషియా దేశాల మూలాలున్నాయి.

గాబ్రియల్ అట్టల్ ఇంతకుముందు ఫ్రాన్స్ విద్యామంత్రిగా పనిచేశారు. ఆయన ప్రెసిడెంట్ మెక్రాన్ సన్నిహితులలో ఒకరు. గాబ్రియల్ ఒక ప్రశాంత స్వభావం గల రాజకీయ నాయకుడని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు.

ఈ ఏడాది చివరిలో యూరిపియన్ యూనియన్ ఎన్నికలు జరగనుండడంతో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మానుయెల్ మెక్రాన్ తన మంత్రివర్గంలో కొందరినీ తప్పించాలనుకునే సమయంలో ఎలిజెబెత్ రాజీనామా చేయడం.. గాబ్రియల్ నూతన ప్రధానిగా నియమితులు కావడం ఓ కీలక పరిణాయమం.

62 ఏళ్ల ఎలిజెబెత్ బోర్న్ ఫ్రాన్స్ ప్రధాన మంత్రిగా రాజీనామా చేయడానికి కారణం.. ఆ దేశంలో ఇమిగ్రేషన్ చట్టాలపై రాజకీయంగా తీవ్ర ఒత్తిడి ఉండడమే. అందుకే ఆమె సోమవారం తన రాజీనామాను ప్రెసిడెంట్ మెక్రాన్‌కు సమర్పించారు. మెక్రాన్ ఈ చట్టానికి సమర్థిస్తున్నారు. అందుకే ఆయన వెంటనే ఎలిజబెత్ రాజీనామాను అంగీకరించారు.

ఎలిజెబెత్ బోర్న్ ఫ్రాన్స్ ప్రధాన మంత్రిగా 2022లో బాధ్యతలు చేపట్టారు. ఆమె దాదాపు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన రెండో మహిళగా ఆమె నిలిచారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×