BigTV English

Kesineni Nani Political Future : కేశినేని దారెటు..? అగమ్యగోచరంగా నాని రాజకీయ భవిష్యత్తు..

Kesineni Nani Political Future : గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాను గాలి వీచినా టీడీపీ మూడు ఎంపీ స్థానాలు దక్కించుకుంది .. వాటిలో ఒకటైన విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయం ఇప్పడు హాట్‌హాట్‌గా మారింది. టీడీపీ అభ్యర్ధిగా కేశినేని నాని అక్కడ నుంచి వరుసగా రెండో సారి విజయం సాధించగలిగారు. అయితే ఇప్పుడు విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా కొత్త కేండెట్ వస్తారని టీడీపీ అంటుండటంతో.. కేశినేని నాని రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.. మరి రాజీనామా చేస్తే ఆయన ఫ్యూచర్ ఏంటి? ఏ పార్టీలో చేరతారు?.. తన భవిష్యత్తు కార్యాచరణపై ఎప్పుడు ప్రకటన చేస్తారు?

2019 లో జరిగిన ఎన్నికలలో టిడిపి 23 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ సీట్లుకే పరిమితం అయింది.. అందులో విజయవాడ, గుంటూరు శ్రీకాకుళం పార్లమెంటు సెగ్మెంట్లలో టిడిపి గెలుపొందింది.. పార్టీ బలంతో పాటు నేతలకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్‌తో ఆ మూడు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోగలిగింది.. వాటిలో విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కేశినేని నాని వరుసగా రెండోసారి లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

రానున్న ఎన్నికలకు టిడిపి, జనసేనల పొత్తు ఖరారైంది. ఎలా అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పట్టుదలగా ఉన్న ఆ పార్టీలు గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వడానికి.. అభ్యర్ధులకు సంబంధించి సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నాయి. సర్వేలో నిర్వహిస్తూ మరి సీట్లను కేటాయించేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా పార్టీలో వివాదాస్పదంగా తయారైన కేశినేని నానిని పక్కన పెట్టాలని టీడీపీ నిర్ణయించింది. కేశినేని నానికి టికెట్ లేదని ఈసారి మరి కొంతమందిని పరిశీలిస్తున్నామని అధిష్టానం స్ఫష్టం చేయడంతో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

అధిష్టానం తనను పక్కన పెట్టేయడంతో.. కేశినేని నాని టిడిపి మరో పార్టీలో జాయిన్ అవ్వాలని భావిస్తున్నారట.. ముందుగా తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆమోదించుకున్న తర్వాత టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు నాని ఏ పార్టీలో చేరతారో? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు నాని వైసీపీలో చేరబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. దాంతోపాటు బిజెపిలోనూ చేరే అవకాశం ఉందని మరో ప్రచారం కూడా మొదలైంది. అయితే నాని పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న ఆ పార్టీలు మాత్రం చేర్చుకోవడానికి విముఖత చూపుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతుంది.

దాంతో విజయవాడ ఎంపీ ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారంట .. మొన్నటి వరకు ఆయన వైసిపిలోకి ఆహ్వానిస్తారని ఎదురు చూసినా … వైసీపీ మాత్రం నానిని ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన తర్వాత మాత్రమే తమ పార్టీలోకి రావాలని సూచించినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .. బిజెపి సైతం కూడా నానిని తీసుకునేందుకు ఆలోచిస్తోందని అంటున్నారు .. మొత్తమ్మీద నాని ఏ పార్టీలోకి వెళ్లాలో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారంట .. మరి నాని అనుకున్నట్లు రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా ? …లేక రాజీనామాల ఆలోచన పక్కనపెట్టి టీడీపీలోనే కొనసాగుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×