E-Paper
Advertisement

ఆకట్టుకుంటున్న సూర్య ‘ సీన్’ తెలుగు ట్రైలర్..ఎలా ఉందంటే?

ఆకట్టుకుంటున్న సూర్య ‘ సీన్’ తెలుగు ట్రైలర్..ఎలా ఉందంటే?
Advertisement

Scene Movie Trailer:కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న సూర్య ఇప్పుడు సీన్ చిత్రంతో మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు నవంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాంటి ఈ చిత్రం నుండి తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుశీన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. జ్యోతిక – సూర్య ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సూర్య సీన్ మూవీ ట్రైలర్ రిలీజ్..

ఇకపోతే అక్టోబర్ 31వ తేదీన తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. నేడు తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి సీన్ ట్రైలర్ విషయానికి వస్తే.. సూర్య పోలీస్ డిపార్ట్మెంటులో ఎవరిని లెక్కచేయని తిరుగులేని లెజెండ్ కాప్ ఇన్ బరాజ్ పాత్రలో కనిపించనున్నారు. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సడన్గా ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో ట్రైలర్ చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. “రాజీనామా తర్వాత ఏం చేస్తావంటే?”, “రాజకీయాల్లోకి వెళ్తానంటూ ” సూర్య చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. ఇక కథలో భాగంగా ఒక ప్రమాదకరమైన అత్యంత క్రూరమైన సైకో కిల్లర్ ఈశ్వర్ (నస్లెన్) ఆట కట్టించడానికి మాజీ పోలీస్ అయిన సూర్య మళ్లీ రంగంలోకి దిగాల్సి వస్తుంది. సూర్యకి సమానమైన తెలివితేటలతో నస్లెన్ నడిపించే మైండ్ గేమ్స్, ఇద్దరి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ చేంజ్ ట్రైలర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

also read:ఆ ఐదుగురే టార్గెట్.. ఝాన్సీ వ్యాఖ్యలతో వారిలో మార్పు వస్తుందా?

ట్రైలర్ ఎలా ఉందంటే?

ఇక ఈ చిత్రంలో మాయ అనే పాత్రలో నజ్రియా నటిస్తోంది. ఇందులో నజ్రియా గ్లామర్ తో పాటు కొన్ని పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలలో కూడా కనిపించి అలరించింది. విలన్ బెదిరిస్తుంటే..” అలెక్సా.. ఏదో ఒక మంచి మూడ్ ఉన్న మ్యూజిక్ ప్లే చేయి” అంటూ సూర్య చెప్పే డైలాగ్ చివరిలో వచ్చే మాస్ విజువల్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అలా భారీ అంచనాల మధ్య ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్ర బృందం.. నవంబర్ 6న తమ స్టోరీ తో ఏ విధంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జగరం స్టూడియోస్ , 2డి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

సూర్య హ్యాట్రిక్ కొడతారా?

Advertisement

ఇకపోతే గత రెండు చిత్రాలతో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సూర్య.. ఈ సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు అనే కామెంట్లు ట్రైలర్ చూశాక ఆడియన్స్ నుండి వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమా గనుక సూపర్ హిట్ అందుకుందంటే సూర్య ఖాతాలో మరో హ్యాట్రిక్ పడడం గ్యారెంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం దీపావళి సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటుందో.

 

Related News

వెంకీ మామకు షాక్.. ఆదర్శ కుటుంబం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే!

పెయింటింగ్‌లా పాలక్ తివారీ.. చూపు తిప్పుకోనివ్వని అందంతో సోషల్ మీడియాలో రచ్చ!

ఆ ఏడు రోజులు నిద్రపోలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్

అందాల ఆరబోతలో తగ్గేదే లేదంటున్న హెబ్బా!

రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. రేపే అసలు హంగామా!

ఎస్పీ బాలు చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? కన్నీళ్లు పెట్టించిన సాలూరి వాసు రావు!

మంచు మనోజ్ కారులో ఎక్కితే అంతే సంగతులు.. రాజీవ్ కనకాల వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×