E-Paper
Advertisement

అల్వాల్‌ జానకీనగర్‌లో భారీ చోరీ.. 29 తులాల బంగారం, నగదు అపహరణ!

అల్వాల్‌ జానకీనగర్‌లో భారీ చోరీ.. 29 తులాల బంగారం, నగదు అపహరణ!
Advertisement

Alwal Theft: స్వేచ్ఛ బ్యూరో: ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఇంటికి తాళం వేసి బంధువుల ఊరెళ్లిన కుటుంబానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జానకీనగర్‌లో చోటుచేసుకున్న ఈ భారీ చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బంధువుల ఇంటికి వెళ్లడమే అదనుగా..

Advertisement

జానకీనగర్‌కు చెందిన నర్సింహమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి దమ్మాయిగూడలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉందనే విషయాన్ని ముందే గ్రహించిన దుండగులు, రాత్రికి రాత్రే పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాల్లో వెతికి విలువైన వస్తువులన్నీ సర్దేశారు. బాధితుల కథనం ప్రకారం.. సుమారు 29.2 తులాల బంగారు ఆభరణాలు, 28 గ్రాముల వెండితో పాటు రూ. 1.20 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.

వెలుగులోకి వచ్చిందిలా..

Advertisement

ఉదయం పూట ఎదురింటి వారు నర్సింహమూర్తి ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించారు. సందేహం వచ్చి వెంటనే ఫోన్ ద్వారా నర్సింహమూర్తికి సమాచారం అందించారు. దీంతో కంగారుగా ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బీరువాలు తెరిచి వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. తాము ఊరికి వెళ్తున్న విషయం బాగా తెలిసిన వ్యక్తులే ఈ పనికి ఒడిగట్టి ఉంటారని బాధితులు బలంగా అనుమానిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు వేగవంతం

ఈ ఘటనపై బాధితులు వెంటనే అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: మల్కారం క్వారీలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

Tags

Related News

ఓయూ పరిధిలో భారీ స్కామ్? ఏకంగా 117 ప్రైవేట్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు!

మల్కారం క్వారీలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎల్ నినో యాక్షన్ ప్లాన్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం!

సీఎం రేవంత్ రెడ్డికి కవిత సంచలన లేఖ.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు డిమాండ్!

ఏపీలో ‘మురసు’ ముసురు.. కుమ్మేస్తున్న వర్షాలు, తీర ప్రాంతాలకు అలర్ట్, తెలంగాణలో కూడా

చౌటుప్పల్‌లో అర్ధరాత్రి దారుణం.. జోగిని దారుణ హత్య.. భారీగా బంగారం, నగదు దోపిడీ!

ఆర్టీసీ ఢీ కొట్టిన లారీ.. స్పాట్‌ లో 15 మంది, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఘటనలు

Big Stories

Advertisement
×