E-Paper
Advertisement

రూ.7 లక్షల నుంచి రూ.1 కోటి వరకు.. నవంబర్‌లో రానున్న కొత్త కార్లు ఇవే!

రూ.7 లక్షల నుంచి రూ.1 కోటి వరకు.. నవంబర్‌లో రానున్న కొత్త కార్లు ఇవే!
Advertisement

Upcoming car launches in November 2026: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, నవంబర్ లో భారత  మార్కెట్లో పలు సూపర్ మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల వరకు పలు కంపెనీలు తమ కొత్త మోడళ్లను తీసుకురావడానికి రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా మెర్సిడెస్ బెంజ్, BYD, మినీ, మారుతి సుజుకి కంపెనీల నుంచి కొత్త వాహనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 2026లో విడుదల కావచ్చని భావిస్తున్న కార్లు, వాటి ధరలు, ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మెర్సిడెస్ బెంజ్ GLC ఎలక్ట్రిక్

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ నవంబర్‌లో GLC ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. GLC 400 4MATIC పేరుతో రానున్న ఈ ఎలక్ట్రిక్ SUV నవంబర్ 4న విడుదల కావచ్చని అంచనా. దీని ధర రూ.80 లక్షల నుంచి రూ.85 లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం. ఈ కారులో డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సెటప్ ఉండనుంది. మంచి డ్రైవింగ్ పనితీరు, ఎక్కువ రేంజ్, లగ్జరీ ఇంటీరియర్ దీని ప్రత్యేకతలు. ఈ కారును పూణేలోని చాకన్ ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

BYD నుంచి డెంజా బ్రాండ్ ఎంట్రీ

Advertisement

చైనాకు చెందిన BYD సంస్థ లగ్జరీ బ్రాండ్ డెంజాను భారత మార్కెట్లో పరిచయం చేయనుంది. నవంబర్ 13న ఈ బ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో భాగంగా డెంజా Z9 GT, డెంజా D9 మోడళ్లు భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. Z9 GT  ప్రీమియం ఎలక్ట్రిక్ షూటింగ్ బ్రేక్ కాగా, D9 విలాసవంతమైన MPV. వీటి ధరలు సుమారు రూ.1 కోటి నుంచి రూ.1.20 కోట్లకు పైగా ఉండవచ్చని తెలుస్తోంది.

మినీ కూపర్ SE, పాల్ స్మిత్ ఎడిషన్

ప్రీమియం కార్లను ఇష్టపడేవారికి మినీ కంపెనీ మరో కొత్త మోడల్‌ ను పరిచయం చేయనుంది. ఆల్ ఎలక్ట్రిక్ కూపర్ SE లైనప్‌ తో పాటు ప్రత్యేకమైన పాల్ స్మిత్ ఎడిషన్‌ను కూడా తీసుకురావాలని భావిస్తోంది. నవంబర్ 27న ఈ కార్లు భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకమైన డిజైన్, క్రేజీ లుక్, ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్ ఈ కార్లలో ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. అయితే వీటి ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్

Advertisement

మారుతి సుజుకి నుంచి కూడా నవంబర్‌ లో కొత్త కారు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న ఫ్రాంక్స్‌ కు ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్‌ ను తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. నవంబర్ 30న ఈ కొత్త మోడల్ విడుదల కావచ్చని తెలుస్తోంది. కొత్త ఫ్రాంక్స్‌ లో ఎక్స్‌ టీరియర్ డిజైన్‌ తో పాటు కొన్ని ఫీచర్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. అయితే ఫీచర్లు, ఇంజిన్ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Also: టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ.. 2027లో రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు!

Tags

Related News

MG విండ్సర్ EV ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

MG విండ్సర్ EV ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

నవంబర్ లో మార్కెట్లోకి కొత్త ఈవీలు.. టీవీఎస్, సుజుకి, ఓబెన్ నుంచి అదిరిపోయే మోడళ్లు!

SMK నుంచి అదిరిపోయే హెల్మెట్.. స్పెషల్ ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ.. 2027లో రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు!

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా సంచలనం.. ఎంజీ విండ్సర్‌కు పోటీగా కొత్త ఈవీ

కొత్త లుక్‌లో హీరో డెస్టిని 110.. క్లాసిక్ ఎడిషన్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×