BigTV English

Google: ఇంటర్వ్యూ చేస్తుండగానే హెచ్ఆర్‌ని తొలగించిన గూగుల్

Google: ఇంటర్వ్యూ చేస్తుండగానే హెచ్ఆర్‌ని తొలగించిన గూగుల్

Google: మాంద్యం దెబ్బకు దిగ్గజ సంస్థలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ 12 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లేఆఫ్స్‌కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇటీవల ఇద్దరు భార్యాభర్తలను ఒకేసారి ఉద్యోగం నుంచి తొలగించి షాక్ ఇచ్చిన గూగుల్.. తాజాగా ఓ హెచ్‌ఆర్‌కి ఇంటర్వూ చేస్తుండగానే.. లేఆఫ్ సందేశం పంపించింది.


హ్యుమెన్ రిసోర్సెస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డాన్ లానిగాన్ ర్యాన్.. సంస్థ కోసం ఒకరిని వర్చువల్‌గా ఇంటర్వూ చేస్తుండగా ఒక్కసారిగా కాల్ కట్ అయిపోయింది. ఆ తర్వాత తిరిగి కాల్ చేసేందుకు ప్రయత్నించినా కూడా కాల్ కనెక్ట్ అవ్వలేదు. సాంకేతిక లోపం అని భావించి కొంత సమయం తర్వాత తిరిగి కాల్ చేసినా కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత తన మెయిల్ చెక్ చేసుకోగా.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు సందేశం వచ్చింది. దీంతో ఒక్కసారిగా ర్యాన్ షాక్ అయింది.

ఇలా అర్ధాంతరంగా సంస్థ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని ర్యాన్ తెలిపింది. ఇటీవలే తన కాంట్రాక్ట్‌ను ఏడాది పొడిగించి జీతం కూడా పెంచారని తెలిపింది. ఇంతలోనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×