BigTV English

Visa: ఊడిన ఉద్యోగం.. ముగుస్తున్న వీసా గడువు.. ఆందోళనలో భారతీయ టెకీలు

Visa: ఊడిన ఉద్యోగం.. ముగుస్తున్న వీసా గడువు.. ఆందోళనలో భారతీయ టెకీలు

Visa: ఆర్థిక మాంద్యం దెబ్బకు దిగ్గజ టెక్ కంపెనీలన్నీ దివాలా తీస్తున్నాయి. ఆర్థికభారాన్ని తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ దాదాపు 2.5 లక్షల మంది ఉద్యోగులను ఇళ్లకు సాగనంపగా.. అందులో దాదాపు లక్ష మంది భారతీయులే ఉన్నారు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. అటు వీసా గడువు ముగుస్తుండడం.. ఇటు కొత్త ఉద్యోగం దొరకకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వాళ్లు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం చూసుకోవాలి. ఈలోగా ఉద్యోగం దొరకకపోతే దేశాన్ని వీడాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక మాంద్యం దెబ్బకు చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగులనే తొలగిస్తున్నాయి.. కానీ కొత్త వారిని తీసుకోవడం లేదు. దీంతో కొత్త ఉద్యోగం వెతుక్కోవడం పెద్ద సవాల్‌గా మారింది.

ముఖ్యంగా హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లి ఉద్యోగం కోల్పోయిన వారి పరిస్థితి దారుణంగా ఉందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ వెల్లడించింది. చూస్తుండగానే 60 రోజుల సమయం గడిచిపోతుండడంతో.. తమ పిల్లలను వెంట పెట్టుకొని స్వదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×