Israel – Hamas War updates(Today’s international news): ఇజ్రాయిల్ హమాస్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీస్ టార్గెట్‌గా హమాస్ రాకెట్లు ప్రయోగించింది. ఈ క్రమంలోనే టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇజ్రాయిల్ తెలిపింది. హమాస్ అగ్రనేత హనియే హత్య తర్వాత ఇజ్రాయిల్ పై దాడులు చేసేందుకు హమాస్ సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఇజ్రాయిల్‌పై హమాస్ మెరుపుదాడులు చేసింది. ఈ సందర్భంగానే హమాస్‌కు చెందిన సాయుధ అల్ – ఖస్సామ్ బ్రిగేడ్.. టెలీ అవీవ్ టార్గెట్‌గా M90 రాకెట్స్ ప్రయోగించింది. హమాస్ రాకెట్ల దాడికి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్‌లో పేలుళ్లు సంభవించాయి. ఈ మేరకు పేలుళ్ల శబ్ధం కూడా వినిపించిందని ఇజ్రాయిల్ మీడియా తెలిపింది. కానీ హమాస్ రాకెట్ల దాడుల కారణంగా ఇజ్రాయిల్‌లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతాయన్న వేళ దాడులు జరగడం గమనార్హం