BigTV English
Advertisement

Harini Amarasuriya: యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు శ్రీలంక ప్రధాని పదవి.. ఎందుకో తెలుసా?

Harini Amarasuriya: యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు శ్రీలంక ప్రధాని పదవి.. ఎందుకో తెలుసా?

Former Academic Harini Amarasuriya as Sri Lanka’s Prime Minister: శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె ప్రమాణస్వీకారం చేశారు. 54 ఏళ్ల హరిణి అమరసూర్య నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి చెందినది కాగా, ఆమెతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగు మరో ఇద్దరు నేతలను క్యాబినెట్‌ మంత్రులుగా నియమించారు. దీంతో శ్రీలంకలో అధ్యక్షుడు అమర కుమార దిసనాయకే, ప్రధానమంత్రి హరిణి అమరసూర్యతో పాటు మొత్తం నలుగురితో కూడిన మంత్రివర్గం కొలువుదీరింది.


ఇదిలా ఉండగా, శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మూడో మహిళగా హరిణి గుర్తింపు పొందింది. అంతకుముందు ఫ్రీడమ్ పార్టీకి చెందిన సిరిమావో బండారు నాయకే (1994-2000) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మూడు సార్లు(1960-65, 1970-77, 1994-2000) ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. రెండో ప్రధానిగా చంద్రికా కుమార తుంగా 1994లో కేవలం రెండు నెలలు మాత్రమే ప్రధానిగా చేశారు. ఇక మూడో మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణి అమరసూర్యకు న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి ముఖ్యమైన శాఖలను కేటాయించారు.

హరిణి అమరసూర్య.. శ్రీలంకలో హక్కుల కోసం పోరాటం చేసేవారు. ఈమె ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమరసూర్య.. ఎంపీగా ఎన్నికైంది. ఇదిలా ఉండగా, ఎన్‌పీపీకి చెందిన ఎంపీలు విజిత హెరాత్, లక్ష్మణ్ నిపుణ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.


శ్రీలంకలో సామాజిక న్యాయం, విద్యకు హరిణి గణనీయమైన కృషి చేసింది. 1970 మార్చి 6వ తేదీన జన్మించిన హరిణి.. శ్రీలంక 16వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది. హరిణి సోషియాలజీలో బీఏ ఆనర్స్, ఎంఏ ఆంత్రోపాలజీ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్‌డీని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. కొన్నాళ్లు ఆమె యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. 2011 నుంచి ఆమె ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆమె నియామకం రాజకీయాల్లో మహిళలకు పురోగతికి సూచికగా మారింది. ఈమె 2020లో ఎన్పీపీ కూటమి తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు 9వ పార్లమెంట్‌లో 2020 నుంచి 2024 మధ్యన మొత్తం 269 రోజులు హాజరుకాగా, 120 రోజులు గైర్హాజరయ్యారు. ఇక, శ్రీలంకలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి విద్యావేత్తగా, మూడో మహిళాగా అమరసూర్య చరిత్ర సృష్టించారు.

Also Read: శాంతికి టెర్రరిజం పెనుముప్పు.. గ్లోబల్ యాక్షన్ అవసరమని మోదీ పిలుపు

ఇక శ్రీలంక రాజధాని కొలొంబోలో మంగళవారం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత హరిణి అమరసూర్యతో శ్రీలంక కొత్త అధ్యక్షుడు కుమార దిసనాయకే ప్రమాణం చేయించారు. అంతకుముందు అధికార మార్పిడిలో భాగంగా ప్రధాని పదవికి దినేష్ గుణ వర్ధన రాజీనామా చేశారు. కాగా, మరో రెండ్రోజుల్లో ప్రస్తుతం పార్లమెంట్ రద్దు కానుందని శ్రీలంక కొత్త అధ్యక్షుడు కుమార దిసనాయకే వెల్లడించారు. దీంతో శ్రీలంక ముందస్తు పార్లమెంట్ ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశం ఉందని సమాచారం.

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×