BigTV English

Chennai Airport: తప్పిన పెను ప్రమాదం.. విమానంలో మంటలు.. 280 మంది ఉక్కిరిబిక్కిరి!

Chennai Airport: తప్పిన పెను ప్రమాదం.. విమానంలో మంటలు.. 280 మంది ఉక్కిరిబిక్కిరి!

Smoke From Wing Of Dubai-Bound Flight At Chennai Airport: తమిళనాడులో ఘోర ప్రమాదం తప్పింది. చెన్నైలోని అన్నా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రాత్రి విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా.. ఒక్కసారిగా విమానం రెక్కల నుంచి పొగలు వ్యాపించాయి. సరిగ్గా రాత్రి 9.50 గంటల వ్యవధిలో అన్నా విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


విమానం టేకాఫ్ అవుతుండగా.. మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో ఇంజన్ నుంచి పొగలు రావడంతో ఒక్కసారిగా అందరూ కంగారు పడ్డారు. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేపింది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఎయిర్ ఫోర్ట్ ఫైర్ అండ్ రెస్క్యూ టీంకు సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగి విమానం రెక్కలనుంచి వస్తున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 280 మంది ప్రయాణికులు ఉండగా.. వీరంతా చెన్నై నుంచి దుబాయ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులను ఎక్కించే సమయంలో విమానంలో ఇంధనం నింపారు. అయితే కాసేపటికే పొగలు రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత పొగలు వ్యాపించి ఉంటే ఏంటి పరిస్థితి ఎలా ఉండేదోనని భయాందోళనకు గురయ్యారు.


అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే విమానంలో ఉన్న ప్రయాణికులను ఎయిర్ పోర్టులోని వెయిటింగ్ రూమ్‌నకు తరలించారు. అనంతరం విమానంలో తలెత్తిన సమస్యలను పరిశీలించారు. మరి ఏమైనా మరమ్మతులు ఉన్నాయా? లేదా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. దీంతో విమానం ఆలస్యంగా బయలుదేరిందని సమాచారం.

ప్రమాదం సమయంలో 280 మంది ప్రయాణికులు ఉండగా.. విమానంలో పొగలు వచ్చాయని తెలిసిన వెంటనే అందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే సిబ్బంది 10 నిమిషాల్లోనే పొగలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, పొగలు రావడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Also Read: హిందువులకు గొడ్డుమాంసం లడ్డూలు.. రేసుగుర్రం మద్దాలి శివారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా, ఈ విమానం బయలుదేరేందుకు సరిగ్గా నాలుగు గంటలు ఆలస్యమైంది. దీంతో అర్ధరాత్రి 1 తర్వాత విమానం టేకాఫ్ అయినట్లు సమాచారం. విమానంలో పొగలు వ్యాపించడానికి గలు కారణాలను అధికారులు వెల్లడించలేదు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×