E-Paper
Advertisement

అమెరికా డ్రీమ్‌కు బ్రేక్.. గ్రీన్‌కార్డు రూల్స్ మరింత కఠినం! భారతీయుల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు!

అమెరికా డ్రీమ్‌కు బ్రేక్.. గ్రీన్‌కార్డు రూల్స్ మరింత కఠినం! భారతీయుల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు!
Advertisement

US Green Card Rules: వలసలపై ట్రంప్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఏదో విధంగా అమెరికాలో అడుగు పెట్టకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా గ్రీన్ కార్డుపై ఫోకస్ చేశారు. అమెరికా డాలర్ డ్రీమ్‌కు బ్రేక్ వేసింది ట్రంప్ సర్కార్. రానున్న కొత్త రూల్స్‌తో భారతీయులకు ఉద్యోగులకు ఇక చుక్కలే కనిపించనున్నాయి. భారతీయ ఐటీ, మెడికల్ ఉద్యోగులకు ఊహించని దెబ్బగా చెబుతున్నారు.

అమెరికాలో గ్రీన్‌కార్డు రూల్స్ మరింత కఠినం!

అమెరికాలో విదేశీ ఉద్యోగులకు ఇచ్చే గ్రీన్‌ కార్డు నిబంధనలను కఠినతరం చేస్తోంది ట్రంప్ సర్కార్. ఫలితంగా అమెరికాలో సెటిల్ అవ్వాలని కోరుకునే ఐటీ, వైద్య రంగాలకు నిఫుణులకు ఊహించని షాక్. ఆ రంగాలకు సంబంధించి అధిక నైపుణ్యాలు ఉండే ప్రొఫెషనల్‌ స్థాయి వరకు అన్ని ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకే తొలి ప్రయార్టీ ఇచ్చేలా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లేబర్‌ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ప్రోగ్రామ్‌ ఎలక్ట్రానిక్‌ రివ్యూ మేనేజ్‌మెంట్‌ -పెర్మ్‌, ఇమిగ్రెంట్‌ వీసా ప్రక్రియ కింద నూతన విధానం తీసుకొచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇందులో భారీ స్థాయి సవరణకు ప్రయత్నిస్తుండటం ఇదే ఫస్ట్ టైమ్.

Advertisement

విదేశీయులకు సరిపోయేలా ఉద్యోగ అర్హతలను యజమానులు రూపొందించడాన్ని నూతన నిబంధనలు నిషేధం విధిస్తాయి. ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేటప్పుడు అందరికీ సమాన అవకాశాలు, ఒకే రకమైన విధానాలను యజమానులు ఉపయోగించాల్సి ఉంటుంది. డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనలు తప్పనిసరి చేసింది. వార్తాపత్రికల ప్రకటనల స్థానంలో యజమానుల వెబ్‌సైట్లు, జాబ్‌ పోర్టళ్లు, జాబ్‌ మేళాలు, క్యాంపస్ నియామకాల ద్వారా ఆన్‌లైన్‌ నియామకాలను ప్రోత్సహించాల్సి ఉంటుంది.

భారతీయుల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు!

ఉద్యోగ ఖాళీలపై ప్రకటనలు జారీ చేసే కనీస సమయాన్ని ఇప్పుడున్న నెల రోజుల నుంచి మూడు నెలలకు పెంచాలి. అర్హులైన అమెరికన్లను నియమించుకోవడానికి తాము నిజమైన ప్రయత్నాలు చేశామని కచ్చితంగా యజమానులు నిరూపించుకోవాలి. రెండేళ్లలో అమెరికన్ ఉద్యోగులను తొలగించిన కంపెనీలు, అదే తరహా పోస్టుల కోసం విదేశీయులకు శాశ్వత లేబర్ సర్టిఫికేషన్-PERM కోరకుండా నిషేధం విధించింది. అధిక వేతనం దక్కే ఉద్యోగాల్లో విదేశీయుల కంటే అమెరికన్లకు తొలి ప్రాధాన్యం లభించేలా చేస్తాయన్నది అమెరికా కార్మిక శాఖ మంత్రి కీత్‌ సోండర్లింగ్‌ మాట.

Advertisement

వృత్తులకు చట్టబద్ధమైన లేబర్‌ మార్కెట్‌ పరీక్షను దాటవేయడానికి యజమానులకు అనుమతించే పాలనా మినహాయింపు రద్దుకు ప్రతిపాదించామన్నారు. సవరించిన కొత్త నిబంధనల ప్రకారం.. ఫిజియో థెరపిస్టులు, నర్సులు, సైన్స్‌, కళల్లో అసాధారణ సామర్థ్యం అవసరమయ్యే పోస్టుల కోసం నియామకాలు జరిపే సదరు యజమానులు తొలుత అమెరికన్‌ దరఖాస్తుదారులను పరిగణనలోకి తీసుకోవాలి. EB-2 కేటగిరీ సాధారణంగా ఉన్నత డిగ్రీలు కలిగిన నిపుణులను కవర్ చేస్తుంది. EB-3 నైపుణ్యం గల కార్మికులు, నిపుణులు, కొన్ని ఇతర కార్మికులను కవర్ చేస్తుంది.

ALSO READ: మాజీ ప్రధాని హసీనా స్వదేశానికి! ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో పేలుళ్లు, పలువురికి గాయాలు

PERM అనేది ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఒక దశ మాత్రమే. ఆమోదించబడిన లేబర్ సర్టిఫికేషన్ మాత్రమే శాశ్వత నివాసాన్ని కల్పించదు. F-1 వీసాలపై ఉన్న విద్యార్థులు ఈ ప్రతిపాదన వారి OPT లేదా STEM OPT అర్హతను మార్చదని గమనించాలి. యజమాని స్పాన్సర్‌షిప్ ద్వారా అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న భారతీయులకు ఇక కష్టమే. ఒకవేళ వీటిని ఆమోదిస్తే నియామక ప్రక్రియ సుదీర్ఘంగా సాగడం, యజమానుల పరిశీలన పెరగడం, PERM దరఖాస్తును దాఖలు చేయడానికి ముందు అదనపు అడ్డంకులు ఏర్పడటం వంటివి జరగవచ్చని చెబుతున్నారు.

Related News

మాజీ ప్రధాని హసీనా స్వదేశానికి! ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో పేలుళ్లు, పలువురికి గాయాలు

ట్రంప్ ప్రభుత్వానికి షాక్‌ల మీద షాక్.. విద్యార్థులు, జర్నలిస్టులకు బిగ్ రిలీఫ్, న్యాయస్థానం కీలక ఆదేశాలు

హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. పేలిన మూడు చమురు నౌకలు, ఇరాన్ ప్రకటన

పెను ప్రమాదం.. 5 అంతస్తుల భారీ నౌకను ఢీకొట్టిన ట్యాంకర్.. నీటిలో బోల్తాపడ్డ క్రూయిజ్!

అమెరికాలో తీవ్ర గందరగోళం.. ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన వేలాది విమానాలు.. ప్రయాణికుల నరకయాతన!

జెన్సన్ హువాంగ్‌తోపాటు ఐదుగురు.. వివాహేతర సంబంధాల ఉచ్చు, పదవులు కోల్పోయిన సీఈవోలు

జెన్సన్ రాజీనామా చేయలేదు,తప్పించారు! అమెరికా కాంగ్రెస్ ముందు హాజరు, తాత్కాలిక సీఈఓ కొల్లెట్ క్రెస్

Big Stories

Advertisement
×