Malaysia Fire Accident: రోడ్డు మధ్యన గ్యాస్ పైప్‌లైన్.. అది కాస్త లీక్ అయ్యింది.. ఆ తర్వాత మంటలు చెలరేగాయి. ఈ ఘటన జరిగిన తర్వాత దారుణం అంతా ఇంతా కాదు. ఆకాశంలో అంతెత్తున ఎగిసిపడ్డాయి మంటలు. ఈ మంటలను చూస్తేనే ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా ఉన్నాయి. ఈ దారుణ ఘటన జరిగింది మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో.
కౌలాలంపూర్‌లోని పుత్రా హైట్స్‌లో మంగళవారం ఉదయం గ్యాస్ పైప్‌లైన్ నుంచి మంటలు చెలరేగడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల ధాటికి సమీపంలోని నివాస ప్రాంతాలన్ని ధ్వంసమయ్యాయి. కిలోమీటర్ దూరం నుంచి చూసిన మంటలు ఎగిసిపడటం కనిపిస్తుందంటే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ అధికారులు వెంటనే మంటలను అదుపు చేసే పనులు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు లీక్ అయిన పెట్రోనస్ గ్యాస్ పైప్‌లైన్‌లో సరఫరాను నిలిపివేశారు. దీంతో మంటల ప్రభావం తగ్గింది. మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాపించడంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ అగ్ని ప్రమాదంలో మప్ఫైమూడు మంది పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. వారందరికి తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే మూడు గ్యాస్ స్టేషన్‌లో ఉన్నాయి. అయితే ఈ మంటలు వాటిపై ప్రభావం చూపకపోవడంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు. లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదంటున్నారు అధికారులు.
Also Read: 3 లక్షలకు పైగా ప్రాణ నష్టం.. భూకంపంతో జపాన్ కనుమరుగు?
ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంధి శాఖ డైరక్టర్ వాన్ మొహమ్మద్ రజాలి వాన్ ఇస్మాయిల్ స్పందించారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పైప్ లైన్‌లలో సుమారు 500 మీటర్ల పొడవునా మంటల ఎగిసిపడ్డాయని ఆయన తెలిపారు. ఈ ఘటన జరిగిన కొంత సమయం తర్వాత పైప్ లైన్‌ను వేరుచేశామని పెట్రోనాస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మండుతున్న పైప్ లైన్‌లోని వాల్వ్‌ను మూసివేసినట్లు తెలిపారు.
❗️🇲🇾 – A massive fire broke out at a gas station in Putra Heights, Malaysia, causing widespread concern in the area.
Emergency responders, including firefighters, are working tirelessly to contain the blaze, which is believed to have been triggered by a gas pipeline explosion.… pic.twitter.com/CJmcbs37D3
— 🔥🗞The Informant (@theinformant_x) April 1, 2025