Ukraine President Zelenskyy Salary, Family’s Earnings: గత కొద్ది సంవత్సరాలుగా ఉక్రెయిన్ యుద్ధంతో అల్లాడుతున్నది. ఈ వార్ ఎప్పుడు? ఎలా ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. బలమైన శత్రువుతో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. న్యాయం తమవైపే ఉందని, తప్పకుండా విజయం సాధిస్తామనే దీమాలో ఉన్నారు ఉక్రెయిన్ పాలకులు. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలన్ స్కీ తన సంపాదనకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.
2024లో జెలన్ స్కీ సంపాదన ఎంత అంటే?
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ 2024లో తన సాలరీ, కుటుంబ ఆదాయాన్ని వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల మీద మొత్త 15.2 మిలియన్ల ఉక్రేనియన్ హ్రైవ్నియాలు కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఒక ఉక్రేనియన్ హ్రైవ్నియా భారత కరెన్సీలో 2 రూపాయల 7 పైసలు. అంటే జెలన్ స్కీ ఫ్యామిలీ ఆస్తులు సుమారు రూ. 1.6 కోట్లుగా ఉంటుంది. వీటిలో ప్రభుత్వ బాండ్ల ద్వారా 8.5 మిలియన్ల ఉక్రేనియన్ హ్రైవ్నియాలు పొందినట్లు వెల్లడించారు. గత ఏడాది తన జీతంగా 3,36,000 ఉక్రేనియన్ హ్రైవ్నియాలు అంటే భారత కరెన్సీలో సుమారు 7.5 లక్షలు అందుకున్నారు. 2023లో అతడి కుటుంబ ఆదాయం 12 మిలియన్ల ఉక్రేనియన్ హ్రైవ్నియాలుగా ఉన్నట్లు తెలిపారు. ఒక దేశ అధ్యక్షుడు ఆస్తులు ఇంత తక్కువగా ఉన్నాయంటే, అతడు ఎంత హానెస్ట్ అనేది అర్థం అవుతుందంటున్నారు విశ్లేషకులు.
త్వరలో పుతిన్ మరణం- జెలన్ స్కీ
ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే చనిపోతాడని రీసెంట్ గా జెలెన్ స్కీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పుతిన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇటీవల ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తమనకు తెలిసిందన్నారు. “పుతిన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. త్వరలో ఆయన చనిపోతారు. ఆ తర్వాత రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుంది. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనడం పుతిన్ కు ఇష్టం లేదు. యుద్ధం ఆపేయాలని రష్యాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది” అని జెలెన్ స్కీ రిక్వెస్ట్ చేశారు. పుతిన్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ఇటీవల జరిగిన ప్రచారం నేపథ్యంలో జెలెన్ స్కీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
జెలన్ స్కీ హత్యకు కుట్ర
ఉక్రెయిన్ అధ్యక్షడు జెలన్ స్కీ హత్యకు కుట్ర పన్నిన ఓ వ్యక్తిని రీసెంట్ గా పోలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ డైరెక్షన్ లో ఆయన ఈ కుట్ర చేసినట్లు గుర్తించారు. పావెల్ కే అనే పోలాండ్ జాతీయుడు, రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కి సమాచారం అందించాడని పోలీసు విచారణలో తేలింది. జెలన్ స్కీ హత్యకు ప్లాన్ చేశాడని గుర్తించారు. రష్యా ప్రత్యేక దళాలు అతడికి సాయం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రష్యన్ ఫెడరేషన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ తో తాను పని చేయడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధంలో నేరుగా పాల్గొన్న రష్యన్ పౌరులతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడిపై ఆరోపణలు నిరూపించేందుకు అధికారులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు.
Read Also: 3 లక్షలకు పైగా ప్రాణ నష్టం.. భూకంపంతో జపాన్ కనుమరుగు?