BigTV English

Huge ring Of Galaxies : విశ్వం మిస్టరీ.. బిగ్ రింగ్..!

Huge ring Of Galaxies : విశ్వం మిస్టరీ.. బిగ్ రింగ్..!
Huge ring Of Galaxies

Huge ring Of Galaxies : అనంత విశ్వం గురించి పరిశోధనలు ఎన్ని జరిగినా.. ఎప్పటికప్పుడు కొత్త వింతలు వెలుగు చూస్తూనే ఉంటాయి. వాటిలో బిగ్ రింగ్ తాజాది. యూనివర్సిటీ ఆఫ్ లాంక్‌షా శాస్త్రవేత్తలు అత్యంత భారీ వృత్తాకార స్ట్రక్చర్‌ను కనుగొన్నారు. ఆ నిర్మాణం వ్యాసమే 1.3 బిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. ఇక దాని చుట్టుకొలత 4 బిలియన్ కాంతి సంవత్సరాలు. భూమిపై నుంచి చూసే చంద్రుడి సైజ్‌తో పోలిస్తే 15 రెట్లు పెద్దది.


గేలక్సీలు, గేలక్సీ క్లస్టర్లు కలగలసి బిగ్ రింగ్‌లా ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కంటికి కనిపించనంత సుదూరంలో ఉందా రింగ్. అంత భారీ నిర్మాణంలా ఏర్పడటానికి కారణమైన నక్షత్రమండలాలను గుర్తించడం, లెక్కించడమంటే చాలా సమయం తీసుకుంటుంది. బిగ్ రింగ్‌ ఇప్పుడు శాస్త్రవేత్తలకో పజిల్‌గా మారింది.

ఆస్ట్రానమీ ప్రకారం అలాంటి భారీ స్ట్రక్చర్లు ఏర్పడటానికి అవకాశమే లేదు. ఖగోళ శాస్త్రంలో అదో మౌలిక సూత్రం. దానిని కాస్మలాజికల్ ప్రిన్సిపుల్ అంటారు. పదార్థం అనేది విశ్వమంతటా సమంగా వ్యాపించి ఉంటుందని ఆ నియమం చెబుతోంది. నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు మన కంటికి కనిపిస్తున్నా.. విశ్వం పరిమాణంతో పోలిస్తే అవేమంత పెద్దవి కావు. కానీ అంతకు మించి భారీ నిర్మాణాలు ఏర్పడటానికి అవకాశం లేదని కాస్మలాజికల్ ప్రిన్సిపుల్ చెబుతోంది.


దీనికి భిన్నంగా భారీ సైజులో బిగ్ రింగ్ వెలుగుచూడటం శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసింది. దీంతో ఖగోళశాస్త్రం మౌలిక సూత్రాలను తిరగరాయాల్సిన అవసరం కనిపిస్తోంది. కాస్మలాజికల్ ప్రిన్సిపుల్‌ను విభేదిస్తూ ఇప్పటివరకు బయటపడిన ఏడో అతిపెద్ద స్ట్రక్చర్ ఇది. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంక్‌షా పీహెచ్‌డీ విద్యార్థిని అలెక్జియా లెపెజ్ ఈ బిగ్‌రింగ్‌ను కనిపెట్టారు.

దీనికి సమీపంలోని అతి భారీ జెయింట్ ఆర్క్‌ను మూడేళ్ల క్రితం ఆమె వెలుగులోకి తెచ్చారు. అది 3.3 బిలియన్ కాంతి సంవత్సరాల మేర విస్తరించింది. ఇతర ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టిన స్లోన్ గ్రేట్ వాల్(పొడవు 1.5 బిలియన్ కాంతి సంవత్సరాలు), సౌత్ పోల్ వాల్(1.4 బిలియన్ కాంతి సంవత్సరాల పొడవు) కూడా భారీ స్ట్రక్చర్లే.

గేలక్సీల సూపర్‌క్లస్టర్ అయిన హెర్క్యులిస్-కరోనా బొరియాలిస్ గ్రేట్‌వాల్‌ ఇప్పటివరకు బయటపడిన అతి పెద్ద స్ట్రక్చర్. 10 బిలియన్ కాంతి సంవత్సరాల వెడల్పు ఉంటుందది. గురుత్వాకర్షణ అస్థిరత ప్రక్రియ వల్ల విశ్వంలో ఇలాంటి భారీ నిర్మాణాలు ఏర్పడుతుంటాయనే సూత్రీకరణ ఉంది.

Related News

Donald Trump: చైనాపై సింపతీ.. ట్రంప్ ఆంతర్యం ఏంటి?

Trump – Putin: ట్రంప్ ఉండి ఉంటే.. ఉక్రెయిన్‌తో యుద్ధమే జరిగేది కాదు.. పుతిన్ కీలక వాఖ్యలు

Trump, Putin Meeting: తగ్గేదే లే..! ట్రంప్, పుతిన్ చర్చించిన అంశాలు ఇవే..

Trump and Putin: ట్రంప్, పుతిన్ భేటీపై ఉత్కంఠ..! ఎవరి పంతం నెగ్గుతుంది..

America-Russia: అమెరికా-రష్యా చర్చలు విఫలమైతే భారత్ ని బాదేస్తాం.. తల, తోక లేని ట్రంప్ వార్నింగ్

Tsunami: నిశబ్దంగా.. 100 అడుగుల ఎత్తైన కెరటాలతో ముంచెత్తిన సునామీ, భారీ విధ్వంసం

Big Stories

×