BigTV English

USA: భార్య ఎక్కడ తిరుగుతుందో తెలుసుకోడానికి భర్త ఏం చేశాడంటే?

USA: భార్య ఎక్కడ తిరుగుతుందో తెలుసుకోడానికి భర్త ఏం చేశాడంటే?

USA: ఇంటి, వాహనాల తాళాలు, బ్యాగులను కొన్ని సార్లు ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాము. మనకు అర్జెంటుగా ఉన్న సమయంలోనే ఇలా ఎక్కువగా జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఎంత వెతికినప్పటికీ తగిన సమయానికి దొరకవు. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యాపిల్ సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చింది. అదే యాపిల్ ఎయిర్‌ట్యాగ్. ఈ ట్యాగ్‌ను మన బ్యాగ్‌కి , తాళాలకు అమర్చితే.. ఎక్కడున్నా స్మార్ట్‌ఫోన్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు.


అయితే అమెరికాలో ఓ వ్యక్తి దీనిని నిఘా పరికరంగా ఉపయోగించాడు. కార్లొసె మాట్కిన్ అనే వ్యక్తిని నెల రోజుల క్రితం అతని భార్య వదిలిపెట్టి విడిగా ఉంటుంది. ఈక్రమంలో తన భార్య ఎక్కడ తిరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు మాట్కిన్. దీంతో అతని భార్యకు తెలియకుండా ఆమె కారులో ఎయిర్‌ట్యాగ్‌ను అమర్చాడు. ఆమె ఎక్కడికి వెళ్లినా ట్రాక్ చేసుకుంటూ వెంబడించడం మొదలు పెట్టాడు. ఒకరోజు ఆమె ఓ రెస్టారెంట్‌కు వెళ్లగా కారు దగ్గర పూలను ఉంచాడు.

అలాగే పలుమార్లు ఆమెకు ఫోన్ చేసి విసిగించాడు. తిరిగి తన దగ్గరకి వచ్చేయాలంటూ వేధింపులకు గురిచేశాడు. అయితే కొద్దిరోజుల తర్వాత అతని భార్య కారులో ఎయిర్‌ట్యాగ్‌ను గుర్తించింది. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మాట్కిన్‌పై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు మాట్కిన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే దానిని అమర్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×