BigTV English
Advertisement

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

US on H 1B Visa:  తమ దేశంలో జాబ్ చేయాలని భావించే భారతీయులకు షాక్ ఇచ్చింది అమెరికా. హెచ్-1బీ వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. దీంతో అమెరికాలో ఉండే భారతీయులు, హెచ్ 1 బీ వీసాకు అప్లై చేసినవారు, అమెరికాకు వెళ్లాలని భావించేవారిలో ఆందోళన మొదలైంది.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన నిబంధనలపై ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్. హెచ్‌-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుం వార్షిక ఫీజు కాదని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైమ్ ఫీజు మాత్రమేనని తెలిపింది.

ఇప్పటికే ఈ తరహా వీసా ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని తేల్చింది. వారిపై ఈ లక్ష డాలర్ల రుసుం విధించబోమని క్లారిటీ ఇచ్చేసింది. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటికి వెళ్లి తిరిగి రావొచ్చని పేర్కొంది. ఈ కొత్త నిబంధన వారికి వర్తించదని స్పష్టం చేసింది.  భవిష్యత్తులో దరఖాస్తు చేసుకునే వారికి ఈ ప్రకటన వర్తిస్తుంది.  ఈ ఏడాది లాటరీలో పాల్గొన్న వారికి ఇది వర్తించదని క్లారిటీ ఇచ్చారు.


చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున కార్యనిర్వాహక ఉత్తర్వులు ఆదివారం అర్ధరాత్రి అమల్లోకి రానుంది. ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై అమెరికన్ కంపెనీలు తమ విదేశీ కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

ALSO READ: హెచ్ 1 బీ వీసా రుసుం పెంపు.. భారత్ టెక్ కంపెనీల పరిస్థితి ఏంటి?

H-1B వీసాలు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కంప్యూటర్ ఇంజనీర్లు, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ కార్మికులను అమెరికాలో పని చేయడానికి అనుమతిస్తాయి, ప్రారంభంలో మూడు సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు ఆరు సంవత్సరాల వరకు పొడిగించారు. ఆ తరహా వీసాలను టెక్ ఇండస్ట్రీ విస్తృతంగా ఉపయోగిస్తోంది.

ప్రతి ఏడాది లాటరీ విధానం ద్వారా కేటాయించబడే వీసాల్లో దాదాపు మూడొంతుల మంది భారతీయ పౌరులే ఉన్నారు. మరోవైపు హెచ్‌-1బీ వీసా వ్యవహారంపై జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం గమనిస్తోంది.

H-1B వీసా రుసుము అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో తమ పౌరుల కోసం అమెరికాలోని భారత రాయబార కార్యాలయం శనివారం అత్యవసర సహాయ నంబర్‌ను విడుదల చేసింది. అత్యవసర సహాయం కోరుకునే భారతీయ పౌరులు సెల్ నంబర్ 1-202-550-9931 కు కాల్ చేయవచ్చు. తక్షణం అనుకునే భారతీయలు మాత్రమే ఈ నంబర్‌ను ఉపయోగించాలి. అమెరికాలోకి భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపింది.

మరోవైపు H 1B వీసా ఛార్జీల పెంపుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. అమెరికా అధ్యక్షుడి ఆదేశాలు అందరికీ దిగ్భ్రాంతి కలిగించాయని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇండో-అమెరికన్ సంబంధాల చారిత్రక సందర్భంలో ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదన్నారు. అమెరికాకు ఇంతకాలం సేవలందించిన మన టెక్ జనాభా, నైపుణ్యం కలిగిన కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సామరస్యంగా పరిష్కరించడానికి భారత ప్రభుత్వం వెంటనే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

 

Related News

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

Big Stories

×