BigTV English

Bangladesh: బంగ్లాదేశ్ లో ఇండియా వీసా సెంటర్లు బంద్.. ఎప్పటివరకంటే?..

Bangladesh: బంగ్లాదేశ్ లో ఇండియా వీసా సెంటర్లు బంద్.. ఎప్పటివరకంటే?..

Bangladesh news today live(Today’s international news): బంగ్లాదేశ్ లోని ఇండియాన్ వీసా అప్లికేషన్ సెంటర్లు నిరవధికంగా మూసివేస్తున్నట్లు బంగ్లాదేశ్ ఇండియన్ వీసా అధికారులు గురువారం తెలిపారు. ఇండియన్ వీసా అప్లికేషన్ పోర్టల్ లో దీనికి సంబంధి ఓ ప్రకటన జారీ చేశారు.


”అన్ని ఇండియన్ వీసా అప్లికేషన్ వీసా సెంటర్లు నిరవధికంగా మూసివేయడం జరిగింది. కార్యకలాపాల పునురుద్ధరణ తేదీలను ఎస్ ఎంఎస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆఫీసుల మళ్లీ తెరిచిన తరువాత భారత పౌరులు తమ పాస్ పోర్టు మరుసటి రోజు వచ్చి తీసుకోగలరు,” అని ఇండియన్ వీసా సెంటర్ బంగ్లాదేశ్ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో నిరసనలు హింసాత్మక మారడంతో ఇప్పటివరకు 469 మంది చనిపోయారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసులు ధ్వంసమయ్యాయి. ప్రధాన మంత్రి షేక్ హసీనా చేత దేశ సైన్యం బలవంతంగా రాజీనామా చేయించి దేశం నుంచి బయటికి పంపింది. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.

షేక్ హసీనా భారత దేశంతో స్నేహ సంబంధాలు కొనసాగించేవారు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోతున్న రాజకీయ పార్టీలు, సైన్య ప్రభుతం ఇండియా పట్ల స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగించడం అనుమానమే. పైగా బంగ్లాదేశ్ లో ప్రస్తుతం హిందువులు, భారతీయుల నివాసాలు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి.


ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని ఇండియా హైకమిషన్ సిబ్బంది లో చాలా మంది తిరిగి స్వదేశం చేరుకున్నారు. బంగ్లాదేశ్ లో మొత్తం 19000 మంది భారతీయులు నివసిస్తున్నట్లు ఇటీవలే విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. వీరిలో 10000 మంది విద్యార్థులని.. ఇప్పటికే చాలామందిని సురక్షితంగా భారత దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జెనెరల్ వాకర్ ఉజ్ జమాన్ మిలిటరీ శాసకుడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా నోబెల్ విజేత మహహ్మద్ యూనుస్ బాధ్యతలు చేపట్టనున్నారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి ప్రస్తుతం ఇండియాలో తల దాచుకోగా.. చాలా సంవత్సరాలుగా జైలులో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకురాలు మాజీ ప్రధాన మంత్రి ఖాలిదా జియా విడుదలయ్యారు. ఆమె ప్రస్తుతం అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నారు.

Also Read: ‘బంగ్లాదేశ్ అల్లర్లలో ఆర్మీ హస్తం’.. అంతర్జాతీయ మీడియా కథనం!

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×