Big Stories

Iran Drone Attack on Israel: ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్ల దాడి.. ఖండించిన ఐరాస సెక్రటరీ జనరల్!

Iran Drones Attack on Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచమంతా మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని భయపడుతుండగానే.. ఇజ్రాయెల్ పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇస్లామిక్ దేశం ఇరాన్ డ్రోన్ల దాడిని ప్రారంభించింది. సిరియా రాజధాని అయిన డెమాస్కస్ లో ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి చేసి.. ఇద్దరు సైనికులను చంపిన ఇజ్రాయెల్ కు తగిన బుద్ధి చెప్పాలని భావించింది ఇరాన్. ఇజ్రాయెల్ పై ఏ క్షణానైనా ఇరాన్ దాడికి దిగొచ్చని స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు కూడా ప్రకటించింది.

- Advertisement -

శనివారం ఇరాన్ డజన్ల కొద్దీ డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్ వైపు పంపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాక్ గగనతలం మీదుగా ఇరాన్ వదిలిన డ్రోన్లు వెళ్తున్నాయని, ఇవి లక్ష్యాలను చేరుకునేందుకు గంటల సమయం పడుతుందని తెలిపింది. వందలకొద్దీ డ్రోన్లను ఇజ్రాయెల్ వైపు పంపిన ఇరాన్ ను ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది. డ్రోన్లలో కొన్నింటిని సిరియా, జోర్డాన్ ల వద్దే ఇజ్రాయెల్ కూల్చివేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్య అమెరికా దళాలు మరికొన్నింటిని కూల్చివేశాయి.

- Advertisement -

Also Read: ఇరాన్ అదుపులో ఇజ్రాయెల్ కార్గో షిప్‌.. చిక్కుకున్న 17 మంది భారతీయులు

తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ లు గగనతలాలను మూసివేశాయి. మరోవైపు సిరియా, జోర్డాన్ లు తమ వైమానిక దళాలను కూడా అప్రమత్తం చేశాయి. కాగా.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఖండించారు. తక్షణమే ఇరాన్ కాల్పులను విరమించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీ నుంచి హమాస్ – ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News