Strait Of Hormuz: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో హర్మూజ్ జలసంధిలో మళ్లీ అలజడి మొదలైంది. తాజాగా హోర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న రెండు నౌకలపై క్షిపణి దాడి జరిగింది. ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ ఈ దాడికి పాల్పడినట్లు అమెరికా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి.
హర్మూజ్ జలసంధిలో అలజడి: ఇరాన్ లో ఆదివారం ఆదేశ దివంగత సుప్రీం అయితుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన వెనుక ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వీటిని ప్రయోగించినట్టు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు.
రెండు నౌకలపై ఇరాన్ దాడి: ఈ ఘటనలో రెండు నౌకలు దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆ అధికారి మీడియాకు తెలిపారు. ఒమన్ తీరానికి సమీపంలో ఆయిల్ నౌక మంటల్లో చిక్కుకుందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సెంటర్ తెలిపింది. ఈ దాడి వెనుక ఇరాన్ ఉండవచ్చని అనుమానిస్తోంది.
ఖమేనీ అంతిమ యాత్ర సమయంలో ఘటన: ఈ ఘటన వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం లేదని, సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపింది. ఇరాన్ దివంగత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో వరుస దాడులు జరగడం గమనార్హం. అంతేకాదు జలసంధిలో దాడులను నిలిపివేయాలని ఖతార్ ఆధ్వర్యంలో అమెరికా-ఇరాన్‌ల మధ్య వారం రోజుల ఒప్పందం గడువు ముగిసిన వెంటనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి.
ALSO READ: నీటి ఒప్పందంపై భారత్ వర్సెస్ పాక్.. సింధు హక్కుల కోసం రాజీ పడేదే లేదంటున్న బిలావల్!
నౌకలు జాగ్రత్తగా ప్రయాణించాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాన్ని వెంటనే యూకే మారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు తెలపాలని సూచించింది. ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు. పదే పదే ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోలేక పోవడం వల్లే హోర్ముజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పేరు చెప్పని వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది.