E-Paper
Advertisement

నీటి ఒప్పందంపై భారత్ వర్సెస్ పాక్.. సింధు హక్కుల కోసం రాజీ పడేదే లేదంటున్న బిలావల్!

నీటి ఒప్పందంపై భారత్ వర్సెస్ పాక్.. సింధు హక్కుల కోసం రాజీ పడేదే లేదంటున్న బిలావల్!
Advertisement

Indus Treaty: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న నీటి వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. చారిత్రాత్మక ‘సింధు జలాల ఒప్పందాన్ని’ (IWT) భారత్ తాత్కాలికంగా నిలిపివేయడంపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ అత్యంత తీవ్రంగా స్పందించారు. భారత్‌తో అన్ని రంగాల్లోనూ, అవసరమైతే యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను ఒక్కసారిగా పెంచేశాయి. సింధు నది నీటిని భారత్ ఒక వ్యూహాత్మక ఆయుధంగా మలచుకోవాలని చూస్తోందని ఆరోపించిన బిలావల్, తమ దేశ జీవనాడి లాంటి నీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.

ఈ వివాదానికి అసలు మూలాలు గతేడాది జరిగిన ఘోర ఉగ్రదాడిలో ఉన్నాయి. ఏప్రిల్ 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తీవ్ర నిర్ణయం తీసుకున్న భారత్.. సరిహద్దు ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయని పాక్‌కు బుద్ధి చెప్పేందుకు 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ వైపు నుంచి ఉగ్రవాద ఊచకోత పూర్తిగా అంతమయ్యే వరకు ఈ నీటి ఒప్పందం పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలే మరోసారి ఖరాకండిగా తేల్చి చెప్పింది. అయితే, ఈ ఒప్పందం సాంకేతికంగా ఇప్పటికీ అమలులోనే ఉందంటూ పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేస్తున్న వాదనలకు బిలావల్ భుట్టో మద్దతు ఇస్తూనే, ఈ వివాదాన్ని మరింత రాజేశారు.

Advertisement

పాకిస్థాన్ నుంచి వస్తున్న ఈ యుద్ధ హెచ్చరికలపై భారత రక్షణ, నిఘా వర్గాలు అంతే ఘాటుగా స్పందించాయి. అంతర్గత రాజకీయ ప్రయోజనాల కోసం, అంతర్జాతీయంగా భారత్‌పై అపవాదు వేయడానికే పాక్ నేతలు ఇలాంటి నిందాపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని భారత వర్గాలు కొట్టిపారేశాయి. ద్వైపాక్షిక జలాల అంశాన్ని అంతర్జాతీయ వేదికలపైకి నెట్టి మైలేజ్ పొందాలనేది పాక్ ఎప్పటినుంచో అనుసరిస్తున్న కుయుక్తి అని మండిపడ్డాయి. దశాబ్దాలుగా పొరుగు దేశం సాకుతున్న ఉగ్రవాద చరిత్రే వారి దూకుడు వైఖరిని, శాంతి పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందని భారత నిఘా వర్గాలు ఎండగట్టాయి.

నిజానికి 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం.. సింధు నది వ్యవస్థలోని ఆరు నదులలో తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నీటిపై భారత్‌కు పూర్తి హక్కులు ఉండగా, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నీటిని పాకిస్థాన్ వాడుకుంటోంది. భారత్ ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు, ఒప్పందాలకు కట్టుబడే ఉంటుందని, అయితే దేశ రక్షణ, ప్రజల ప్రాణాల కంటే ఏ ఒప్పందమూ ముఖ్యం కాదని భారత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాక్ నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉన్నా సమర్థవంతంగా ఎదుర్కొని, దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తమకున్న అన్ని దౌత్య, సైనిక హక్కులను పూర్తి స్థాయిలో వినియోగిస్తామని భారత్ ధీటుగా స్పష్టం చేసింది.

Advertisement

Also Read: పర్యాటకానికి ‘ఫ్యూచర్’ కళ.. ఎకో టూరిజంపై సీఎం రేవంత్ కీలక సమీక్ష

Related News

భారీ రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది.. పిరమిడ్ల నిర్మాణ సీక్రెట్ ఇదే!

కుప్పకూలిన బంగారు గని, 100 మందికి పైగా మృతి! ఇంతకీ ఎక్కడో తెలుసా?

ఆపరేషన్ బార్బరోస్సా.. హిట్లర్ చేసిన ఆ ఒక్క పొరపాటే రెండో ప్రపంచ యుద్ధ ఫలితాన్ని మార్చేసిందా?

హర్మూజ్‌లో ఇరాన్‌కు మైండ్ బ్లాంక్ సీన్.. 80% నౌకలు అటే.. అసలు ఒమన్ ప్లాన్ ఏంటి?

ఉత్తర కెన్యాలో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి!

మత్స్యకారుడిపై ఆక్టోపస్ దాడి.. ముఖాన్ని చుట్టేసి చిత్రవధ.. వీడియో వైరల్!

ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. జైలు నుంచి ఆస్పత్రికి.. పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

భారత ఎన్నికల వ్యవస్థ అమోఘం.. అమెరికా చూసి నేర్చుకోవాలి.. ట్రంప్ ప్రశంసల వర్షం!

Big Stories

Advertisement
×