BigTV English

Trump coments on Kamala Harris: ట్రంప్ కు గోరోజనం తగ్గలేదు..ఇండియన్స్ ఫైర్

Trump coments on Kamala Harris: ట్రంప్ కు గోరోజనం తగ్గలేదు..ఇండియన్స్ ఫైర్

“Is She Indian Or Black?”.. Donald Trump coments on Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఊపందుకున్నాయి. నిన్నటి దాకా జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీగా సాగిన సమరం సడన్ గా యూ టర్నగా మారింది. బైడెన్ ఎన్నికల బరిలోనుంచి తప్పుకోవడంతో కమలా హ్యారిస్ ను ట్రంప్ ప్రత్యర్థిగా డెమోక్రాట్స్ నిలబెట్టారు. తనకి ఇక ఎదురే లేదని భావించిన ట్రంప్ కమల ఎంట్రీతో ఖంగు తిన్నారు. అయితే ట్రంప్ వ్యూహాలు తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. మొన్నటి కాల్పుల సంఘటనతో ట్రంప్ పై సానుభూతి ఒక్కసారిగా పెరిగిందని ట్రంప్ మద్దతుదారులు భావిస్తున్నారు. అయినా గెలుపు అంత ఈజీగా తీసుకోవద్దని ట్రంప్ కు సూచిస్తున్నారు.


ట్రంప్ కు ఇది కొత్త కాదు

ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. గత ఎన్నికలలో అమెరికా ఉద్యోగాలు ఇకపై అమెరికన్లకే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రాంతీయతపై గొంతు చించుకుని ప్రచారం చేశారు. ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టి తద్వారా తన ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూశారు ట్రంప్. అయితే అనూహ్యంగా గత ఎన్నికలలో జో బైడెన్ కు పట్టం కట్టారు. జో బైడెన్ కు రైట్ హ్యాండ్ గా ఉంటూ వస్తున్నారు కమలా హ్యారిస్. ఆమె భారత సంతతి వ్యక్తి. కాకపోతే అమెరికాలోనే స్థిరపడ్డారు. కమలా హ్యారిస్ తాత, బామ్మలు కేరళ ప్రాంతానికి చెందినవారు. అమెరికా పౌరసత్వాన్ని పొందిన కమలా హ్యారిస్ తన ప్రతిభా పాటవాలతో రాజకీయ పదవులు చేపడుతూ జో బైడెన్ కు మొదటినుంచి మద్దతునిస్తూ డెమోక్రటిక్ పార్టీలో ఎదిగారు. కమలాహ్యారిస్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో జో బైడెన్ ఆమెకు అమెరికా చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలి పదవీ బాధ్యతను అప్పగించారు.


కమలా హ్యారిస్ కు పెరుగుతున్న మద్దతు

పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే కమలా హ్యారిస్ మంచి వక్త. జో బైడెన్ ప్రసంగాల పదును వెనక కమలా హ్యారిస్ హస్తం ఉండంటారు. అయితే కమలా హ్యారిస్ రాకతో అధ్యక్ష ఎన్నికల సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ట్రంప్ కు లోలోపల భయం పట్టుకుంది. భారతీయ ఓటర్లంతా కమలా హ్యారిస్ కే పట్టం కడతారని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. దీనితో మళ్లీ తన పాత పద్దతిలో ప్రచారం మొదలు పెట్టారు. జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. కమలా హ్యారిస్ ఎప్పుడూ ఇండియన్స్ కు సపోర్టుగానే మాట్లాడతారని ఆమె వస్తే అమెరికన్లకు ఎఫెక్టే అన్నారు. పైగా ఆమె నల్లజాతి మహిళ అని అందుకే నల్లజాతి మహిళగానే పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారని అన్నారు. అంతకు మించి కమలా హ్యారిస్ ఇన్నాళ్లూ ఇండియన్ సంతతి అని తనకు తెలియదని వ్యంగ్యంగా అన్నారు. దీనితో ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికన్ ఇండియన్స్, నల్లజాతి కి చెందిన దేశాల పౌరులు ట్రంప్ ను తిట్టిపోస్తున్నారు.

జాతి వివక్ష వ్యాఖ్యలపై ఫైర్

నల్ల జాతి వారు పనికిరానప్పుడు వారి ఓట్లు పనికి వస్తాయా అంటూ ట్రంప్ ను ఆడుకుంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను తప్పపడుతోంది అమెరికన్ వైట్ హౌస్. ఎప్పుడో జనం మర్చిపోయిన జాతి వివక్షను మళ్లీ ట్రంప్ గుర్తుచేస్తున్నారంటూ మళ్లీ జాతి వివక్ష పోరాటాలకు ట్రంప్ ఆద్యం పోస్తున్నాడని అంటున్నారు. కాగా ట్రంప్ వ్యాక్యలతో విజయావకాశాలు కూడా సన్నగిల్లాయని అమెరికా సర్వే సంస్థలు చెబుతున్నాయి. ట్రంప్ సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ నోటి దురుసును తగ్గించుకుంటే మంచిదని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రయోజనం ఏమీ ఉండదని..అది వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని అమెరికా రాజకీయ విమర్శకులు చెబుతున్నారు.

Related News

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Afghanistan: బస్సులో చెలరేగిన మంటలు.. 71 మంది సజీవదహనం!

Russia Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తా! జెలెన్‌స్కీతో ట్రంప్ సంచలన భేటీ..

Congo Massacre: కాంగోలో దారుణం.. వెంటాడి మరీ 52 మందిని చంపేశారు

Nigeria Boat tragedy: మార్కెట్‌కి వెళ్తుండగా పడవ బోల్తా.. 40 మంది గల్లంతు

Big Stories

×