BigTV English

Iran Israel war : ఇజ్రాయిల్ భారీ ఆయుధ డీల్.. అదే జరిగితే ఆ దేశం ఖేల్ ఖతం

Iran Israel war : ఇజ్రాయిల్ భారీ ఆయుధ డీల్.. అదే జరిగితే ఆ దేశం ఖేల్ ఖతం

Iran Israel war : ఓ వైపు తీవ్రవాద గ్రూపులు, మరోవైపు శత్రు దేశాలతో యుద్ధంలో తలమునకలై ఉన్న ఇజ్రాయిల్.. తన సైనిక బలాన్ని మరింత పెంచుకునే పనిలో పడింది. ఈ మేరకు.. ఇజ్రాయిల్ తాజాగా కుదుర్చుకున్న ఓ ఆయుధ ఒప్పందం.. తన శత్రు పక్షాలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా.. యుద్ధ క్షేత్రంలోకి తలదూర్చిన ఇరాన్ కు ఇజ్రాయిల్ నిర్ణయం షాక్ ఇచ్చింది.  


బలమైన సైనిక, నిఘా సామర్థ్యంతో.. చుట్టూ ఎన్ని శత్రు దేశాలున్నా ఇజ్రాయిల్ అదరదు, బెదరదు. సైద్ధాంతిక వైరి వర్గాలన్నీ కలిసి వచ్చినా, తిప్పికొట్టే సైనిక సత్తా ఉన్న ఈ దేశం.. ఇప్పుడు మరో పెద్ద ఆయుధ డీల్ కుదుర్చుకుంది. తన వాయుసేనాను మరింత పటిష్టం చేసేందుకు 25 ఆధునాతన యుద్ధ విమానాలను కొనుగోలు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే.. ఒప్పందాలు సైతం పూర్తి చేసింది. ఈ డీల్ విలువ 5.2 బిలియన్ డాలర్లని తెలిపిన ఇజ్రాయిల్ రక్షణ మంత్రిత్వ శాఖ.. ఆమెరికా సైనిక సహాయం కింద అందిస్తున్న నిధులతో ఈ ఒప్పందానికి నిధులు సమకూర్చుకుంటున్నట్లు వెల్లడించింది. 

ప్రస్తుత ఆయుధ ఒప్పందంలో భాగంగా 25 బోయింగ్ F-15IA ఫైటర్ జెట్‌లు ఇజ్రాయిల్ దళాల్లోకి చేరనున్నాయి. ఇవి.. F-15EX కి అత్యాధునిక ఇజ్రాయిల్ సాంకేతికతో అప్ గ్రేట్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ లు. వీటిని 2031  నుంచి డెలివరీ ప్రారంభించి.. ఏడాదికి 4 నుంచి 6 యుద్ధ విమానాల్ని అందించేందుకు తయారీ సంస్థలు అంగీకరించాయి. కొత్త జెట్‌లు అత్యాధునిక ఇజ్రాయెల్ సాంకేతికతలతో, అధునాతన ఆయుధ వ్యవస్థలతో రూపుదిద్దుకోనున్నాయి. వీటిలో దీర్ఘ శ్రేణి లక్ష్యాల్ని మరింత మెరుగ్గా టార్గెట్ చేసే వ్యవస్థలతో పాటు, పేలోడ్ సామర్థ్యం పెంచనున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. వీటితో పాటు మరిన్ని అంతర్గత, సాంకేతిక ఫీచర్లతో వీటిని అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు.


ఈ జెట్లు ఇజ్రాయెల్ వైమానిక దళాన్ని మరింత శక్తివంతం చేస్తాయని చెబుతున్న అధికారులు. మధ్యప్రాచ్యంలో ప్రస్తుత, భవిష్యత్తు భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సరిపోతాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  గాజా వివాదం మొదలైన 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ దాదాపు USD 40 బిలియన్ల ఆయుధ ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుత యుద్ధ అవసరాల నేపథ్యంలో అధునాతన ఆయుధాలు, మందుగుండు సామాగ్రికి ఇజ్రాయెల్ ప్రాధాన్యత ఇస్తుందన్న అధికారులు.. దీర్ఘకాలిక వ్యూహాత్మక సామర్థ్యాలను పెంచుకునేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తుందని వెల్లడించారు. కాగా.. ఇటీవలే.. ఈ ఏడాది ప్రారంభంలోనే మూడు F-35 స్క్వాడ్రన్‌ లను ఇజ్రాయిల ఎయిల్ ఫోర్స్ లోకి వచ్చి చేరాయి. 

Also Read : నిన్న ట్రంప్ ను గెలిపించా.. రేపు ట్రూడోను ఒడిస్తా.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

ఇజ్రాయిల్ ఇప్పటికే.. మధ్య ప్రాచ్యంలో బలమైన సైనిక శక్తి ఉన్న దేశం. అలాంటి దేశం.. ఇటీవలి యుద్ధ సంక్షోభంలో మరిన్ని ఆయుధ కొనుగోళ్లు, ఒప్పందాలు చేసుకుంటూ.. మిగతా దేశాలకు అందకుండా శక్తిని సమీకరించుకుంటోంది. తాజా ఈ పరిణామం.. ఇరాన్ కు మరింత ప్రమాదమంటున్నారు.. రక్షణ వర్గాల నిపుణులు. ఇరాన్ పనులకు ఆగ్రహించి.. పరిమిత దాడులు చేసిన ఇజ్రాయిల్ ను మరింత దారుణంగా దెబ్బతీస్తామంటున్న ఇరాన్..  ఇజ్రాయిల్ దూకుడు నిర్ణయాలతో భయంతో గుప్పిట్లో బతుకుతోంది. ఈ విమానాలు ఇప్పుడే… యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెట్టకపోయినా… నిత్యం రావణ కాష్టంలా ఉండే ఈ ప్రాంతంలో ఎప్పటికైనా.. తమకు ప్రమాదమే అనేది ఇరాన్ భయం.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×