Nikhil Siddhartha : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన నిఖిల్. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమాలో రాజేష్ అనే పాత్రలో కనిపించి మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఈ సినిమా తర్వాత హీరోగా కూడా సినిమాలు చేసే అవకాశం వచ్చిందో నిఖిల్ కి. నిఖిల్ నటించిన యువత సినిమాతోనే దర్శకుడు పరశురాం కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పరిచయం అయ్యాడు. ఇకపోతే నిఖిల్ కెరియర్ లో మంచి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా కార్తికేయ వంటి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో కూడా గుర్తింపు సాధించుకున్నాడు. కార్తికేయ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాతో దర్శకుడు చందు కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు.
దర్శకుడు చందు మొండేటి, సుధీర్ వర్మ, శరన్ వీళ్ళందరూ కూడా మంచి స్నేహితులు. వీరిలో సుధీర్ వర్మ, చందు తో నిఖిల్ రిపీటెడ్ గా పనిచేశాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ చేసిన సినిమా స్వామి రారా. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ నిఖిల్ కెరియర్లో ఈ సినిమాకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాతోనే సుదీర్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు సుదీర్ వర్మ సరైన హిట్ సినిమా అందుకోలేకపోయాడు. సుధీర్ వర్మ ఎన్ని సినిమాలు చేసినా కూడా అవి టెక్నికల్ గా బాగానే ఉంటున్నాయి గానీ కథ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు అని చెప్పాలి.
Also Read : Spirit: మూడు గెటప్స్ లో ప్రభాస్ , సందీప్ ప్లానింగ్ అదుర్స్
ఇక ప్రస్తుతం దర్శకుడు సుధీర్ వర్మ వరుసగా డిజాస్టర్ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. శాకిని డాకిని, రావణాసుర వంటి సినిమాలు తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా అపుడో,ఇపుడో,ఎపుడో సినిమా టైటిల్ లాగానే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు షూటింగ్ జరిగిందో కూడా తెలియదు. ఇకపోతే ఈ సినిమాను కూడా చాలా హడావిడిగా రిలీజ్ చేశారు. నిఖిల్ కి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు ఉంది. ఈ తరుణంలోనే కెరియర్ మరింత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడో చేసిన సినిమాను కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం వలన ఒకవైపు దర్శకుడికి మరోవైపు హీరోకి కూడా కొద్దిపాటి బ్యాడ్ నేమ్ వస్తుంది. చాలా సడన్ గా ఈ సినిమాను హడావిడిగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సరైన ప్రమోషన్స్ కూడా చేయలేదు. నిఖిల్ నటించిన స్పై సినిమా కూడా ఇలా హడావిడిగానే రిలీజ్ చేశారు. స్పై రిలీజ్ విషయంలో నిఖిల్ కూడా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా మళ్లీమళ్లీ నిఖిల్ అదే తప్పులు ఎందుకు చేస్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఇకనైనా పర్ఫెక్ట్ గా కెరియర్ ప్లాన్ చేసుకుంటాడేమో వేచి చూడాలి.