BigTV English

Sai Pallavi: ఆడియన్స్ ప్రతీసారి నన్ను క్షమించారు.. సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్

Sai Pallavi: ఆడియన్స్ ప్రతీసారి నన్ను క్షమించారు.. సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్

Sai Pallavi: కొందరు భామలు.. హీరోయిన్లుగా పరిచయమయిన కొన్నాళ్లలోనే ఎలాగైనా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ ముందుకు వెళ్దామని అనుకుంటారు. కానీ కొందరు మాత్రం అలా కాదు.. తమకు నచ్చిన కథ, పాత్రలు దొరికేవరకు ఎన్నాళ్లైనా వెయిట్ చేస్తారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. అందుకే తను హీరోయిన్‌గా పరిచయమయ్యి దాదాపు పదేళ్లు అవుతున్నా తను నటించిన సినిమాల సంఖ్య చాలా తక్కువే. అయినా కూడా కాంప్రమైజ్ అవ్వదు ఈ ముద్దుగుమ్మ. అయితే హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్ల తర్వాత తనకు ఫ్లాపులు ఎదురయ్యాయి. ఆ ఫ్లాపులను ఎలా హ్యాండిల్ చేశారు అనే ప్రశ్నకు సాయి పల్లవి ఆసక్తికర సమాధానమిచ్చింది.


తప్పు చేస్తే ఎలా

హీరోయిన్‌గా పరిచయమయిన తర్వాత తన మొదటి ఫ్లాప్‌ను ఎలా తట్టుకుందో, ఆ తర్వాత కమ్‌బ్యాక్ కోసం ఎలా సిద్ధమయ్యిందో తాజాగా బయటపెట్టింది సాయి పల్లవి. ‘‘నా మొదటి ఫ్లాప్ సినిమా నన్ను బాగా ఎఫెక్ట్ చేసింది. నేను నా ఫ్యాన్స్‌కు ఒక బ్యాడ్ మూవీ ఇవ్వాలని అనుకోలేదు. కానీ నా ఫ్యాన్స్ క్షమించారు. నేను కమ్ బ్యాక్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాపై మళ్లీ ప్రేమను కురిపించారు. ఆడియన్స్ ప్రేమను దూరం చేసుకోవాలని ఎవ్వరికీ ఉండదు. నేనేమైనా తప్పు చేస్తే ఈ ప్రేమ దూరమయిపోతుందా అనే భయం ఉంటుంది. నాలో కూడా అలాంటి భయమే ఉండేది. కానీ ఆడియన్స్ మాత్రం ప్రతీసారి నన్ను క్షమించారు’’ అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.


Also Read: ‘కూలీ’లో శివకార్తికేయన్ గెస్ట్ రోల్.? క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

కాన్ఫిడెన్స్ వస్తుంది

మామూలుగా ఒక హీరో లేదా హీరోయిన్‌ను ప్రేక్షకులు అభిమానించారంటే వారు చేసిన ఫ్లాప్ సినిమాలను గుర్తుపెట్టుకోరని సాయి పల్లవి అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘మీరు మంచి సినిమా అని నమ్మి అది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్లు కూడా అదే ప్రేమతో రిసీవ్ చేసుకుంటారు. ముందు జరిగిందంతా మర్చిపోయి ఇప్పుడు మీరు చేసిన దానికే వారు ప్రేమిస్తారు. అది యాక్టర్లకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే బ్యాడ్ సినిమా చేసినా వారు ఆదరిస్తారని కాదు కానీ వారి ప్రేమను చూసి తరువాత నుండి ఎలాంటి సినిమాలు సెలక్ట్ చేసుకోవాలి అనే విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. అదే నేను అర్థం చేసుకున్నది’’ అని తెలిపింది సాయి పల్లవి.

నటనకు మంచి మార్కులు

ఇటీవల సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ‘అమరన్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో తను ఇందు రెబెక్కా వర్గీస్ అనే పాత్రలో అందరినీ అలరించింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటించాడు. ఇందులో శివకార్తికేయన్, సాయి పల్లవి.. ఇద్దరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ప్రస్తుతం సాయి పల్లవి తన తరువాతి సినిమాలపై ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం తన చేతిలో నాగచైతన్యతో కలిసి నటిస్తున్న ‘తండేల్’ ఉంది. దాంతో పాటు బాలీవుడ్‌లో డెబ్యూకు సిద్ధమయ్యింది సాయి పల్లవి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×