BigTV English

Iron Sting Bomb : ఇజ్రాయెల్ కొత్త అస్త్రం.. ఐరన్ స్టింగ్..

Iron Sting Bomb : ఇజ్రాయెల్ కొత్త అస్త్రం.. ఐరన్ స్టింగ్..
Iron Sting Bomb

Iron Sting Bomb : ఇజ్రాయెల్ అమ్ములపొదిలో మరో పదునైన అస్త్రం చేరింది. కచితత్వానికి ఐరన్ డోమ్ వ్యవస్థ పర్యాయపదంగా నిలుస్తుంది. ఐరన్ స్టింగ్ కూడా అంతే. హమాస్ టెర్రర్ గ్రూప్ లక్ష్యాలను గురిచూసి అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదీ 120 ఎంఎం మోర్టార్ బాంబ్.


తాజాగా హమాస్‌పై పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్)లోని మగ్లాన్ యూనిట్ ఐరన్ స్టింగ్ మోర్టార్ బాంబులను వినియోగిస్తోంది. ఎంతగా జనసమ్మర్దం, రద్దీ ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని అయినా సరే.. నేర్పుగా, సూటిగా ధ్వంసం చేయగల సామర్థ్యం ఉందీ మోర్టార్ బాంబ్‌కు.

ప్రిసైజ్ లేజర్, జీపీఎస్ గైడెన్స్ సాంకేతికత సాయంతో ఇది సాధ్యమవుతుందని తయారీ సంస్థ ఎల్బిట్ వెల్లడించింది. జనావాసాలు, అర్బన్ ప్రాంతాల్లో సామాన్య ప్రజానీకానికి పెద్దగా నష్టం వాటిల్లకుండా.. శత్రులక్ష్యాలను మాత్రమే ఛేదించడం దీంతో సులువు కాగలదు. అంతే కాదు.. శత్రువుల రాకెట్ లాంచర్‌ను సైతం తునాతునకలు చేయగలదు.


భవిష్యత్తు భూతల యుద్ధాల్లో ఐరన్ స్టింగ్‌దే కీలక పాత్ర కానుంది. 2021లో విస్తృత పరీక్షల అనంతరమే ఇజ్రాయెల్ తన అమ్ములపొదిలో చేర్చింది.
మగ్లాన్ యూనిట్ ఇప్పటివరకు గాజాలో వంద మంది మిలిటెంట్లను ఏరిపారేసింది. యుద్ధం ఆరంభమైన తర్వాత నాలుగో రోజు గాజాపై తొలిసారిగా దీనిని వినియోగించారు.

ఇప్పటి వరకు భూమి నుంచి 12 మోర్టార్లను ప్రయోగించారు. వీటిలో సగం గాజాపై, సగం లెబనాన్‌పై గురిపెట్టారు. వీటికి అదనంగా యుద్ధం ఆరంభమైన తర్వాత 50 రెగ్యులర్ మోర్టార్ బాంబుల ప్రయోగం జరిగింది.

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×