BigTV English

Israeli Missile Attack On Syria : డమాస్కస్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి..!

Israeli Missile Attack On Syria : డమాస్కస్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి..!
Israeli Missile Attack On Syria

Israeli Missile Attack On Syria(International news in telugu) :

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్‌పై జరిగిన క్షిపణి దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) అధికారులు నలుగురు మృతి చెందారు. వారిలో నిఘా వ్యవహారాల యూనిట్ చీఫ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఈ దాడి చేసినట్టుగా ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి.


మృతుల్లో ఐజీఆర్‌సీకి చెందిన అత్యున్నత అధికారులు ఇద్దరు ఉన్నట్టు ఆ వర్గాలు ధ్రువీకరించాయి. డమాస్కస్‌ సమీప మెజాలోని ఓ బహుళ అంతస్తుల భవనం ఈ దాడితో నేలమట్టమైంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ప్రభుత్వ అనుకూలంగా ఉండే ఇరానియన్ సలహాదారుల ఆ భవనాన్ని వినియోగిస్తున్నట్టు సమాచారం.

అదే భవనంలో లెబనాన్, ఇరాన్ ఎంబసీలు పనిచేస్తున్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనలో మరో పది మంది గాయపడ్డారు. గత నెలలో ఇజ్రాయెల్ జరిపిన ఇలాంటి క్షిపణి దాడిలోనే ఇరాన్ జనరల్ సయ్యద్ రజీ మౌసావి మృతి చెందారు.


Related News

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Big Stories

×