BigTV English

Israel Airstrike on Gaza: ఇజ్రాయెల్ దాడులు.. షెల్టర్‌లో 35 మంది సజీవ దహనం!

Israel Airstrike on Gaza: ఇజ్రాయెల్ దాడులు.. షెల్టర్‌లో 35 మంది సజీవ దహనం!

35 People Burned Alive in Israel airstrike on Gaza: ఇజ్రాయెల్-గాజాల మధ్య పరిస్థితి ఏ మాత్రం శాంతించలేదు. రోజురోజుకూ హమాస్-ఇజ్రాయెల్ దూకుడు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఆదివారం ఇజ్రాయెల్.. రఫాపై వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో దాదాపు 35 మంది సజీవ దహనమైయ్యారు.


ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 35 మంది మరణించినట్టు గాజా అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వీరిలో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు రఫాలో ఆసుపత్రులు చాలడం లేదన్నారు. అయితే ఇటీవల ఇజ్రాయెల్ దాడులతో గాజా నుంచి చాలామంది రఫాలోని  వచ్చి తాత్కాలిక షెల్టర్‌లో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు దానిపై బాంబుపడ్డాయి.

చాలామంది మంటలకు సజీవ దహనమైనట్టు పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సొసైటీ వెల్లడించింది. దాడులకు సంబంధించి అనేక వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాత్కాలిక షెల్టర్‌లో భారీగా మంటలు చెలరేగడం, సహాయక సిబ్బంది చర్యల్లో నిమగ్నమై ఉన్నట్లు అందులో కనిపిస్తోంది. వలసదారులపై దాడి చేయడం ఆందోళనగా ఉందని గాజా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


Also Read: హెజ్బొల్లా ‘సర్‌‌ప్రైజ్’ హెచ్చరిక.. త్వరలో మెరుపు దాడులు ?

మరోవైపు ఇజ్రాయెల్ వాదన దీనికి భిన్నంగా ఉంది. తాము దాడులు చేసిన ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారని తెలిపింది. వారు అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఇవన్నీ తెలిసిన తర్వాత దాడులకు దిగినట్టు ఇజ్రాయెల్ దళాలు చెబుతున్నాయి. రఫాపై చేసిన దాడిలో హమాస్ గ్రూప్ అదికారులు యాసిన్ రబియా, ఖలీద్‌ను అంత మొందించినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది.

అంతకుముందు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్ల వర్షం కురిపించారు. దాడుల నేపథ్యంలో సైరన్లు మోగడం గడిచిన ఐదునెలల కాలంలో ఇదే ఫస్ట్ టైమ్. టెల్ అవీవ్‌‌తోపాటు మరిన్ని ప్రాంతాలపై హమాస్ దాడులు చేసిందని ఇజ్రాయెల్ చెబుతున్నమాట.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×