BigTV English

Barack Obama: ఎట్టకేలకు కమలా హారిస్‌కు ఒబామా మద్దతు

Barack Obama: ఎట్టకేలకు కమలా హారిస్‌కు ఒబామా మద్దతు

Barack Obama: డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. మిచెల్‌తో పాటు తాను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. ఎన్నికల్లో కమలా హారిస్ గెలిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని ఒబామా తెలిపారు. నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు బైడెన్ తన స్థానంలో కమలా హారిస్‌ను ప్రతిపాదించారు. ఇప్పటి వరకు మాజీ అధ్యక్షుడు ఒబామా తన మద్దతును తెలపలేదు.


తాజాగా ఒబామా దంపతులు.. కమలాహారిస్‌కు మద్దతు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఒబామా దంపతుల నుంచి హ్యారిస్‌కు ఫోన్ కాల్ వచ్చింది. మిచెల్‌తో పాటు నేను కూడా గర్వంగా ఫీలవుతున్నానని ఈ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ఒబాబా అన్నారు. కమలా నీ పట్ల గర్వంగా ఉంది.. నువ్వు చరిత్ర సృష్టిస్తావు అంటూ మిచెల్ ఫోన్ కాల్‌లో తెలిపారు .

ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ మాట్లాడిన వీడియోను ఒబామా దంపతులు తమ ట్విట్టర్ అకౌంట్‌లో కూడా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఒబామా దంపతులు ఇద్దరికి వెంటనే కమలా హారిస్ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఒబామా దంపతుల మద్దతు ఇప్పుడు తనకు ఎంతో విలువైందని కమలా హారిస్ వెల్లడించారు. ఇక బైడెన్ రేసు నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి వచ్చిన కమలా డెమోక్రటిక్ పార్టీ సభ్యుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన ఒబామా ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఒబామా మద్దతు కమలా హారిస్‌కు ఫండ్ రైజింగ్ కార్యక్రమాలకు సహాయపడనుంది. ఇక డెమోక్రటిక్ పార్టీ అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ను ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఒబామా పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి.


Also Read: ’50 ఏళ్లు సాయం చేసినందుకు థ్యాంక్స్ ‘.. బైడెన్‌ రిటైర్మెంట్ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని

మరోవైపు ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో కమలా హారిస్ రికార్డు సృష్టించారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం కమలా హారిస్ కోసం నిర్వహించిన జూమ్ కాల్ లో రికార్డు స్థాయిలో మహిళలు పాల్గొన్నారు. గంటన్నర కంటే ఎక్కువ సమయం జరిగిన ఈ కాల్ లోనే ఏకంగా రెండు మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో దారా 1.6 లక్షలకు పైగా విరాళాలు అందాయి. కమలా హారిస్‌కు మద్దతుగా వైట్ వుమెన్ ఆన్ ఆన్సర్ ది కాల్ పేరుతో జూమ్ వేదికగా ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కాల్‌లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×