BigTV English

Netanyahu Thanks Biden | ’50 ఏళ్లు సాయం చేసినందుకు థ్యాంక్స్ ‘.. బైడెన్‌ రిటైర్మెంట్ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని

Netanyahu Thanks Biden | ’50 ఏళ్లు సాయం చేసినందుకు థ్యాంక్స్ ‘.. బైడెన్‌ రిటైర్మెంట్ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని

Netanyahu Thanks Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్ష గృహం వైట్ హౌస్ లో గాజా యుద్ధ ముగించే ప్రక్రియలో భాగంగా బైడెన్ తో నెతన్యాహు చర్చలు జరిపారు. ఆ తరువాత వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ని అధికారికంగా కలిశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన తరువాత బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లి.. నెతన్యాహుకు మద్దతు తెలిపారు. ఆ తరువాత ఈ ఇద్దరు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి.


అమెరికా రాజకీయాల్లో ఇటీవల తీవ్ర మార్పులు జరిగాయి. గత ఆదివారం అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్ లో జరిగే ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన స్థానంలో కమలా హ్యారిస్ పోటీ చేయాలని సూచించారు. బైడెన్.. ఆరోగ్య, వయసు పై బడిన కారణాల రీత్యా ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కాబోతున్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ ఇజ్రాయెల్ పక్షాన నిలిచారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. నెతన్యాహు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ”50 ఏళ్లుగా ప్రజా సేవ చేసినందుకు, 50 ఏళ్ల పాటు ఇజ్రాయెల్ కు సాయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను,” అని నెతన్యాహు అన్నారు.

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ డెమొక్రాట్ పార్ట తరపును అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో ఆమె సహకారం కూడా ఇజ్రాయెల్ కు చాలా అవసరం. హమాస్ తో ఇజ్రాయెల్ చేస్తున్న యద్ధం ముగించాలని అమెరికాలో అందరికంటే ముందు చెప్పింది కమలా హ్యారిస్ కావడం గమనార్హం. యుద్ధంలో అమాయక పాలస్తీనా ప్రజలు చనిపోతున్నారని.. ఇది సరికాదని చెబుతూనే ఆమె ఇజ్రాయెల్ ఆత్మరక్షణ చర్యలు తీసుకునే అధికారం ఉందని అన్నారు.


Also Read: ‘ఉక్రెయిన్ తో శాంతి చర్చలకు రష్యా రేడీ.. కానీ’.. షరతులు విధించిన క్రెమ్లిన్ ప్రతినిధి

హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారిలో అమెరికన్లు కూడా ఉన్నారు. వారిని విడిపించేందుకు నెతన్యాహు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని గతంలో బైడెన్, నెతన్యాహు మధ్య విభేదాలు కూడా తలెత్తాయి. ఆ బందీలను త్వరలోనే విడుదల చేస్తామని హమాస్ ప్రకటించారు. యుద్ధం కోసం ఇజ్రాయెల్ కు భారీ మిలిటరీ ఆయుధాలు సరఫరా చేస్తోంది అమెరికా. అయితే ఈ యుద్ధంలో 39000 మందికి పైగా అమాయక పాలస్తీనా పౌరులు చనిపోవడంతో ఇజ్రాయెల్‌పై ఐక్య రాజ్య సమితి చర్యలు తీసుకోకుండా ప్రతీసారి అమెరికా అడ్డుపడింది. దీనిపై ప్రపంచ దేశాలన్నీ అమెరికాని తప్పుపట్టడంతో యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్ పై ఒత్తిడి చేస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా నెతన్యాహు శుక్రవారం భేటీ కానున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×