BigTV English

King Charles III first public appearance: ఆ విషయం తర్వాత.. రాజుగారు బయటికొచ్చారు

King Charles III  first public appearance: ఆ విషయం తర్వాత.. రాజుగారు బయటికొచ్చారు

King Charles III makes Easter Church appearance amid cancer battle


King Charles III first public appearance: బ్రిటన్ రాజు చార్లెస్- 3 తొలిసారి బయటకు వచ్చారు. ఈస్టర్ వేడుకల్లో భాగంగా విండ్సర్ క్యాజిల్‌లో ఆయన పర్యటించారు. ముఖ్యంగా సతీమణి రాణి క్యామిల్లాతో కలిసి వేడుకలకు వచ్చినవారిని పలకరించారు.

సెయింట్ జార్జ్ చాపెల్‌కు చార్లెస్ దంపతులు వచ్చారు. సాధారణ పౌరులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. మద్దతుదారులతో కరచాలనం చేస్తూ పరిసరాల్లో తిరిగారు. అటు అభిమానులతోనూ ముచ్చటించారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ తర్వాత తొలిసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు.


ఆ సమయంలో ప్రిన్స్ విలియమ్, ఆయన వైఫ్ కేట్ మిడిల్టన్ మాత్రం కనిపించలేదు. కేట్ కూడా క్యాన్సర్ బారినపడ్డారు. ఇలా రాజకుటుంబంలో ఇద్దరు క్యాన్సర్ బారినపడడం బ్రిటన్ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది.

ALSO READ: పాక్ ప్రధాని కీలక నిర్ణయం.. రెడ్ కార్పెట్‌కు గుడ్ బై

ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 క్యాన్సర్ సోకినట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారని పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అయితే ప్రొస్టేట్ క్యాన్సర్‌ శరీరంలోకి ఏ భాగానికి ఎఫెక్ట్ అయ్యిందోనన్న విషయాన్ని మాత్రం బయటకు వెల్లడించ లేదు. ఛార్లెస్ 3 ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. ఆసుపత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స కొనసాగుతున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

 

Tags

Related News

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Big Stories

×