BigTV English

KP Sharma Oli: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేపీ శర్మ ఓలి

KP Sharma Oli: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేపీ శర్మ ఓలి

Nepal PM KP Sharma Oli news(Today’s international news): నేపాల్ ప్రధానిగా నియమితులైన కేపీ శర్మ ఓలి విశ్వాస పరీక్షలో నెగ్గారు. పార్లమెంట్ లో నిర్వహించిన బలపరీక్షలో ఆయన సునాయాసంగా గట్టెక్కారు. నేపాల్ పార్లమెంట్ ప్రతినిధుల సభలో మొత్తం 263 మంది సభ్యులు ఉండగా.. కేపీ శర్మ ఓలి ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మాణానికి అనుకూలంగా 188 ఓట్లు రాగా వ్యతిరేఖంగా 74 ఓట్లు వచ్చాయి. అందులో ఒక సభ్యుడు గైర్హాజరు అయ్యారు.


నేపాలీ కాంగ్రెస్, సీపీ‌ఎన్ – యూఎంఎల్, లోక్ తంత్రిక్ సమాజ్ వాదీ పార్టీ, జనతా సమాజ్ వాదీ పార్టీ నేపాల్ ప్రతినిధులు కేపీ ఓలి శర్మకు అనుకూలంగా ఓటు వేసారు. ఇదిలా ఉంటే సీపీ‌ఎన్-మావోయిస్టు సెంటర్, యూనిఫైడ్ సోషలిస్ట్, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సభ్యలు వ్యతిరేకంగా ఓటు వేసారు. ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభలో గత శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు.ఈ క్రమంలోనే కెేపీ శర్మ ఓలి సారథ్యంలో సీపీఎన్ యూఎంఎల్, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచారు.

ఈ క్రమంలో కేపీ శర్మ ఓలి సారథ్యంలో సీపీఎన్ యూఎంఎస్, మరో మాజీ ప్రధాని షేర్ బభదూర్ దేవ్‌బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్.. కూటమిగా ఏర్పడి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తన బలాన్ని నిరైపించుకునేందుకు శర్మ ఓలి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీంట్లో నెగ్గేందుకు వాస్తవానికి 138 ఓట్లు అవసరం కాగా.. ఆయనకు అంతకుమించే ఓట్లు వచ్చాయి. దీంతో ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షల్లో కేపీ ఓలి విజయం సాధించినట్లు స్పీకర్ దేవ్ రాజ్ ఘమిరే ప్రకటించారు.


రాజకీయ అస్థిరతకు మారుపేరుగా నిలిచిన నేపాల్‌లో జూలై 14 న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది,.నూతన ప్రధాని కేపీ శర్మ ఓలి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 22 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు నేపాల్ ప్రధానిగా ఓలి బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం .అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. శుక్రవారం ప్రజా ప్రతినిధుల సభలో జరిగిన విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు.

Also Read: రష్యా సరిహద్దులో హైటెన్షన్.. యూఎస్ విమానాలు ప్రత్యక్షం

ఓలి నేతృత్వంలో యూఎంఎల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ సారథ్యంలో నేపాలీ కాంగ్రెస్ కోటా క్రింద కొన్ని రోజుల క్రితమే అధికారం పంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 18 నెలలు ఓలీ ప్రధానిగా ఉంటారు. తర్వాత పార్లమెంట్ గడువు ముగిసిన వరకు ముగిసే వరకు దేవ్‌ బా ప్రధానిగా కొనసాగుతారు. కాగా ఓలి గతంలో మూడుసార్లు నేపాల్ ప్రతినిధి పనిచేశారు. 2015 అక్టోబర్ 11 నుంచి 2016 ఆగస్టు 3 వరకు 2018 ఫిబ్రవరి 5 నుంచి 2001 జూలై 13 వరకు ఆ తర్వాత కూడా మరోసారి కొన్ని రోజుల పాటు ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఇప్పుడు నాలుగోసారి ప్రధాని పీఠం ఎక్కారు

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×