Chetna chakravarthy Comments on India Men: లైఫ్ కోచ్ చేతన చక్రవర్తి వార్తల్లోకి వచ్చేసింది. ట్రెండ్‌ను తనకు అను కూలంగా మలచుకోవడంలో ఈమెకు తిరుగులేదు. తన మాటలతో హాట్ టాపిక్‌గా నిలిచిందామె. భారతీయ పురుషులపై ఆమె హాట్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారో తెలుసా? భారతీయ పురుషులతో డేటింగ్ చేయను గాక చేయనన్నారు. ఇంతకీ ఆమె వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశమేంటి? ఇంకా లోతుల్లో వెళ్తే..
చేతన చక్రవర్తి.. ఈమెని చాలామంది లైఫ్ కోచ్‌గా చెబుతున్నారు. చాలామందికి తమ జీవితాలను దారిలో పెట్టుకునేందుకు సాయపడ్డారు. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్‌పై దుమారం రేగుతోంది. తాజాగా భారతీయ పురుషులతో అస్సలు డేటింగ్ చేయనని తన మనసులోని మాట బయటపెట్టింది. ఓ భారతీయ మహిళ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇందుకు కారణాలు చెప్పారామె.
మహిళల వాదనను సరిగా పట్టించుకోరన్నది చేతన మొదటి పాయింట్. మహిళలకు పొగరని, ఒక వేళ ప్రశ్నిస్తే మొండి ఘటమనే ముద్రవేస్తారని వెల్లడించింది. వాళ్లకు రొమాన్స్ అంటే ఏమిటో తెలీదని ఒక్క ముక్కలో తేల్చేసిందామె. రోజూ చేసే చిన్నచిన్న పనుల్లోనే రొమాన్స్ దాగుందని, భారీ బహుమతులతో ఎలాంటి ఫలితాలు ఉండవన్నది ఆమె మాట. ముఖ్యంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వారికి తెలీదని, కేవలం భాగస్వామి కోసం కాదని, తాము అక్కడ ఉంటున్నామనే స్పృహ కూడా ఉండదన్నారు.
Also Read: తీవ్ర విషాదం.. కొండ చరియలు విరిగిపడి 157 మంది మృతి
చేతన చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆమె పోస్టు చేసిన వీడియోకు వ్యూస్, లైక్స్ దాదాపు లక్ష వరకు చేరుకున్నా యి. చేతన కామెంట్స్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. ఆమెని సపోర్టు చేసినవారు వున్నారు. అలాగే వ్యతిరేకించేవాళ్లు లేకపోలేదు. ఆమె మాటలను చాలామంది మహిళలు వ్యతిరేకించారు. చేదు అనుభవాలు ఎదురైన మాత్రాన భారతీయ పురుషులను ఒకేగాటన కట్టకూడదని అంటున్నారు. కేవలం భారతీయ పురుషులే ఇలా ఉండరన్నది మరికొందరి అభిప్రాయం. కొందరైతే చేతన మాటలతో ఏకీభవిస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">