EPAPER

Democratic Lloyd Doggett calls: అధ్యక్షుడు బైడెన్‌పై ఒత్తిడి, రేసు నుంచి తప్పుకోవాలంటూ పార్టీలో..

Democratic Lloyd Doggett calls: అధ్యక్షుడు బైడెన్‌పై ఒత్తిడి, రేసు నుంచి తప్పుకోవాలంటూ పార్టీలో..

US presidential election 2024 update(World news today): అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అధికార పార్టీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మరోసారి అధికార పగ్గాలు అందుకోవాలని ఉవ్విల్లూరుతోంది డెమోక్రటిక్ పార్టీ. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. తాజాగా అధ్యక్షుడు బైడెన్‌కు సొంత పార్టీ నుంచి ఎదురుగాలి మొదలైంది.


అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవాలని టెక్సాస్ డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు పిలుపు నిచ్చారు. దీంతో అమెరికా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ తరపున జో బైడెన్- రిపబ్లికన్ నుంచి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ పోటీ పడుతున్నారు. వీరిద్దరు కలిసి ఓపెన్ డిబేట్‌లో పాల్గొన్నారు. అయితే ట్రంప్ దూకుడుకి అధ్యక్షుడు బైడెన్ కాస్త కంగారు పడినట్టు తెలుస్తోంది. ట్రంప్ ప్రశ్నలకు ధీటుగా రిప్లై ఇచ్చినప్పటికీ, కీలక విషయాల్లో కాస్త వెనుకంజ వేసినట్టు తెలుస్తోంది.

అధ్యక్ష అభ్యర్థిపై డెమోక్రటిక్ పార్టీలో చర్చ మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని తప్పిస్తే బాగుంటుందని, లేకుంటే ఓటమి చేజేతురాలా తెచ్చుకున్నవాళ్లం అవుతామని మిగతా నేతలు అంటున్నారు. ఈ క్రమంలో ఓ అడుగు ముందుకేసిన టెక్సాస్‌కు చెందిన డెమోక్రటిక్ సభ్యుడు లాయిడ్ డాగెట్ ఓ ప్రకటన చేశారు.


రానున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ తప్పుకోవాలని కోరారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఎన్నో విజయాలు సాధించారని, అమెరికా ప్రజల కోసం ఆయనెంతో చేశారని గుర్తు చేశారు. ఆయన పట్ల ఎప్పటికీ గౌరవం దగ్గదని మనసులోని మాట బయటపెట్టారు. బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి తప్పు కోవాలని ఓపెన్‌గా చెప్పిన వ్యక్తి డాగెట్.

ట్రంప్‌తో జరిగిన తొలి డిబేట్‌లో జో బైడెన్ తీరుపై ఆ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్‌తో పోటీపడడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికితోడు బైడెన్ వయస్సు రీత్యా తప్పుకుంటే బాగుంటుందని అంటున్నారు. ప్రస్తుతం డెమోక్రాట్ల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నచందంగా మారింది.

ALSO READ: నేపాల్ ప్రధాని ప్రచండకు ఝలక్..మారనున్న ప్రభుత్వం!

అధ్యక్ష ఎన్నికలకు సమయం పెద్దగా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాలి. ఆ వ్యక్తి ప్రజల మనసును గెలుచుకుంటారా? ఇలా రకరకాల ప్రశ్నలు అధికార పార్టీని వెంటాడుతున్నాయి.

Related News

US Presidential Elections : అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం, ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం

Smart Bomb: లెబనాన్‌పై ‘స్మార్ట్ బాంబ్’ వదిలిన ఇజ్రాయెల్.. క్షణాల్లో బిల్డింగులు ధ్వంసం, ఈ బాంబు ప్రత్యేకత తెలుసా?

Justin Trudeau Resignation Demand : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి ఝలక్, రాజీనామాకు పట్టుబట్టిన సొంత పార్టీ ఎంపీలు

Hotel Bill Con couple: 5 స్టార్ రెస్టారెంట్‌లో తినడం.. బిల్లు ఎగ్గొటి పారిపోవడం.. దంపతులకు ఇదే పని!

BRICS INDIA CHINA: ‘బ్రిక్స్ ఒక కలగానే మిగిలిపోతుంది’.. ఇండియా, చైనా సంబంధాలే కీలకం..

INDIA CHINA BILATERAL TALKS : ఐదేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక చర్చలు, మోదీ జిన్‌పింగ్‌లు ఏం మాట్లాడారో తెలుసా ?

Foot Ball Match Fire: ఫుట్ బాల్ మ్యాచ్‌లో విషాదం.. మైదానంలో కాల్పులు.. ఐదుగురు మృతి

Big Stories

×