BigTV English

Maldives: ఇక నుంచి ఈ దేశం పోవడం కష్టమే..?

Maldives: ఇక నుంచి ఈ దేశం పోవడం కష్టమే..?

to ban israeli passport holders: గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచ దేశాలు నిరసిస్తున్నాయి. మాల్దీవుల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్థానికంగా ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ఆ దేశం కీలక చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పాస్ పోర్ట్ ఉన్నవారికి తమ దేశంలో ప్రవేశాన్ని నిషేధించాలని సిద్ధమైంది. ఆ దేశ హోంమంత్రి అలీ ఇహుసన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. మరోవిషయం ఏమంటే.. గాజాలోని పాలస్తీనియన్లకు సాయం చేసేందుకు నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకొచ్చినట్లు కూడా పేర్కొన్నది.


‘ఇజ్రాయెల్ పాస్ పోర్ట్ పై మాల్దీవుల్లోకి ప్రవేశాన్ని వీలైనంత త్వరగా నిషేధించేందుకు అవసరమైన చట్టపరమైనటువంటి సవరణలు చేయాలని దేశ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది’ అంటూ హోం మంత్రి చెప్పారు.

Also Read: వేలంలో లేఖలు.. అందులో ఆమె వ్యక్తిగత విషయాలు కూడా..


ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ నుంచి మాల్దీవులకు ప్రతి ఏటా దాదాపుగా 15 వేల మందికి పైగా పర్యాటకులు సందర్శిస్తుంటారు. గతేడాది అక్టోబర్ లో 7న హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం విధితమే. టెలి అవీవ్ దాడుల్లో ఇప్పటివరకు 36 వేల మందికిపైగా మృతిచెందారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ కూడా దాడులను ఆపాలని ఇజ్రాయెల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×