BigTV English

Sikkim: సిక్కింలో రెండోసారి అధికారంలోకి SKM.. గురువును మళ్లీ ఓడించిన శిష్యుడు

Sikkim: సిక్కింలో రెండోసారి అధికారంలోకి SKM.. గురువును మళ్లీ ఓడించిన శిష్యుడు

Sikkim State: సిక్కిం రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సారథ్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా వరుసగా మరోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలను గెలుచుకుంది. దీంతో సిక్కిం క్రాంతికారి మోర్చాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. 25 ఏళ్ల పాటు సిక్కింను పాలించినటువంటి సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ కేవలం ఒకే ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది. ఒక్క సీటుకు పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అంతేకాదు.. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు చోట్లా కూడా ఓడిపోయాడు.


ఇటు ఈశాన్య రాష్ట్రమైనటువంటి మరో రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో కూడా మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముచ్చటగా మూడోసారి అక్కడ అధికారంలోకి వచ్చింది. మొత్తం అక్కడ 60 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో మూడింట రెండొంతులకు పైగా స్థానాలను తన కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న రెండు ఎంపీ స్థానాలను కూడా తామే కైవసం చేసుకుంటామంటూ వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఆ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ


ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఈ క్రమంలో దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ అధికారం చేజిక్కించుకోనున్నదంటూ వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటు కాంగ్రెస్, బీజేపీలు.. తామే అధికారంలోకి రాబోతున్నామంటూ ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, తాగాజా ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీవైపే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×