Trump-Kamala Debate: డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్.. యూఎస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ అయిన వీరిద్దరి మధ్య ఇప్పటికే హాట్‌హాట్ డిబేట్ జరిగింది. అయితే ఇందులో హారిస్ పైచేయి సాధించారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ డిబేట్ జరిగిన విధానంలోనే డౌట్స్ ఉన్నాయంటున్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటి? హారిస్‌పై అలిగేషన్స్‌కు రిజన్సేంటి?
యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది ప్రచార హోరు పెరుగుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు ఫర్ ది ఫస్ట్ టైమ్ డిబేట్‌లో పాల్గొన్నారు. హాట్ హాట్‌గా జరిగిన ఈ డిబెట్‌లో హారిస్ పైచేయి సాధించారన్న ప్రచారం మొదలైంది. హారిస్ వాదనల ముందు ట్రంప్ తేలిపోయారని.. మొత్తం డిబేట్‌లో హారిస్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవడమే తప్ప.. ట్రంప్ ఆమెను ఇరుకున పెట్టలేకపోయారంటూ చర్చ నడుస్తోంది. ఏబీసీ మీడియా, పొలిటికో, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, CNN, ఫ్యాక్స్ న్యూస్.. ఇలా అనేక మీడియా సంస్థలు హారిస్‌కే జై కొట్టాయి. అబార్షన్ పాలసీ నుంచి మొదలు పెడితే ఎకానమీ, డిఫెన్స్, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, మైగ్రేంట్స్.. ఇలా అనేక సమస్యలు, వాటి పరిష్కారంపై ఆమె చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారని తెలిపాయి. కానీ.. ఇవన్నీ నాణేనికి ఒకవైపే. అసలు విషయం వేరే ఉందన్న చర్చ కాస్త లేట్‌గా మొదలైంది.
ఈ డిబెట్‌ను నిర్వహించింది ఏబీసీ మీడియా. మాములుగా ఇలాంటి డిబెట్స్ జరిగినప్పుడు ఆన్ ది స్పాట్ ఫ్యాక్ట్ చెక్ చేస్తారు. మనలాగా రాజకీయ నేతలు ఏది నొటికొస్తే అలా వాగేయడం ఉండదు అక్కడ. అందుకే వీరిద్దరి డిబేట్ సందర్భంగా ఏబీసీ మీడియా కూడా ఫ్యాక్ట్ చేసింది. ఇందులో చాలా విషయాలు అంటే.. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన చాలా అంశాలు అబద్ధాలు అని ప్రకటించింది ఏబీసీ మీడియా. డిబెట్ ముగిసిన తర్వాత కూడా ఏబీసీ మీడియా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ట్రంప్ చాలా అబద్దాలు చెప్పారని.. హారిస్ మాత్రం అలా చేయలేదని చెప్పింది. అయితే ఈ డిబెట్ ముగిసిన తర్వాత ఓ కొత్త చర్చ మొదలైంది. ఏబీసీ మీడియా ఫ్యాక్ చేయడంలో ట్రంప్‌పై చూపించిన ఇంట్రెస్ట్.. హారిస్ విషయంలో చూపించలేదని ఆరోపణ వినిపించింది. హారిస్ డిబెట్‌లో చాలా అబద్ధాలు చెప్పారని.. కానీ వాటిని చూసి చూడకుండా వదిలేశారు. ఏబీసీ మీడియా సెలెక్టివ్ ఫ్యాక్ట్ చెకింగ్ చేసిందన్న చర్చ స్టార్టయ్యింది.
Also Read: అమెరికాకు పుతిన్ ఫుల్ గా వార్నింగ్ ఇచ్చిపారేశారు
నిజానికి ఏబీసీ నుంచి ఈ డిబెట్‌కు మోడ్రేటర్స్ అంటే.. అనుసంధానకర్తలుగా డేవిడ్ మూరీ, లిన్సీ డేవిస్‌లుగా ఉన్నారు. వీరిద్దరూ హారిస్‌కు ఏకపక్షంగా సపోర్ట్ చేశారన్నది ఇప్పుడు ఆరోపణ. డిబెట్ మొత్తం త్రీ వర్సెస్ వన్ అన్నట్టుగా సాగింది. ఇప్పుడిదే ఇష్యూను హైలేట్ చేస్తున్నారు ట్రంప్ సపోర్టర్స్. నిజానికి బైడెన్‌తో డిస్కషన్ టైమ్‌లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా దూసుకుపోయారు ట్రంప్. కానీ.. హారిస్ విషయానికి వచ్చేసరికి ఆయన తడబడ్డారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. హారిస్‌కు టఫ్ క్వశ్చన్స్ వేయలేకపోయారు ట్రంప్. దీనికి కూడా ఏబీసీ మీడియానే కారణమంటున్నారు. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ విషయంలో హారిస్ అనేక హామీలు ఇచ్చారు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను తొలగించాలన్నారు. ఇల్లీగల్ బార్డర్ క్రాసింగ్ విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ.. ఈ విషయాలను ట్రంప్ ప్రస్తావించినప్పుడు దానికి సంబంధించిన ఏ వివరాలను కూడా ఏబీసీ మీడియా చూపించలేదు. దీంతో ఆమె ఈ ప్రశ్నలను దాటవేయడం ఈజీ అయ్యింది. నిజానికి బైడెన్ పాలనతో ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఆల్ టైమ్ హైకి చేరిందన్న ప్రచారం ఉంది. ఈ విషయాలను కావాలనే తొక్కి పెట్టి ఉంచారంటున్నారు.
బట్.. ఓవరాల్‌గా చూస్తే ఈ డిబేట్ తర్వాత హారిస్ గ్రాఫ్ పెరిగింది. డిబెట్‌లో హారిస్ అదరగొట్టారని 63 శాతం ప్రజలు అనుకుంటున్నారు. డిబెట్ ఏ విధంగా నిర్వహించారన్న దానికంటే.. డిబెట్‌లో ఏం చర్చించారన్న దానిపైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. అందుకే ట్రంప్ మద్ధతుదారులు, రిపబ్లికన్ నేతలు ఇప్పుడు ఈ ఇష్యూపై స్పందిస్తున్నారు. మిస్సోరి సెనైటర్ ఎరిక్ స్కిమ్మిట్‌తో పాటు చాలా మంది ఇప్పుడు ట్రంప్‌కు మద్ధతుగా విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. మరి ఇది ఈ చర్చ అగ్రరాజ్యం ఎన్నికలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.