BigTV English

Anti-Trump Protests: అప్పడు హిట్లర్.. ఇప్పుడు ట్రంప్.. భగ్గుమన్న అమెరికన్లు

Anti-Trump Protests: అప్పడు హిట్లర్.. ఇప్పుడు ట్రంప్.. భగ్గుమన్న అమెరికన్లు

Anti-Trump Protests: అమెరికా మరోసారి హోరెత్తింది. హ్యాండాఫ్ పేరుతో ఇప్పటికే ఓసారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు చేపట్టిన అమెరికన్లు.. ఇప్పుడు వేవ్‌ టూ ఎలా ఉంటుందో చూపించారు. గతం కంటే ఈసారి నినాదాల డోస్ పెంచుతూ.. ఏకంగా నియంతలతో ట్రంప్‌ను పొల్చూతూ ఆందోళనలను ఉధృతం చేశారు అమెరికన్లు. ఇంతకీ అసలు అమెరికాలో ఈ నిరసనల హోరు పెరగడానికి కారణాలేంటి? వీటి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది?


ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆగని నిరసనలు

న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వరకు ..


అమెరికా వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు

అప్పుడు హిట్లర్.. ఇప్పుడు ట్రంప్ అంటూ విమర్శలు

అమెరికాలో రాజులు లేరంటూ నినాదాలు

అమెరికా మళ్లీ భగ్గుమంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా గొంతెత్తారు అమెరికన్లు. ఈసారి కేవలం ఒకటో రెండో నగరాలకు కాకుండా.. USలోని అనేక రాష్ట్రాలకు విస్తరించాయి ఈ నిరసనలు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను నిండ ముంచుతాయంటూ రోడ్డెక్కారు నిరసనకారులు.

ట్రంప్‌ను హిట్లర్, ఫాసిస్ట్‌లతో పొల్నిన నిరసనకరారులు

ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అతనికి వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారైతే రాజులు ఎవరు లేరు.. ఈ దౌర్జన్యాలను ఎదిరించాలి అంటూ ప్లకార్డ్స్ పట్టుకొని నిరసనలు హోరెత్తించారు. ట్రంప్‌ను హిట్లర్, ఫాసిస్ట్‌లతో పొల్చారు నిరసనకరారులు. అంతేకాదు వలసదారులకు స్వాగతం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు నిరసనకారులు.

అమెరికా అధ్యక్ష భవనం ఎదురుగా  నిరసనలు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ఎదురుగా కూడా నిరసనలు జరిగాయి. ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, ప్రజా సేవల్లో కోత, ఆర్థిక వ్యవస్థ, వలస విధానం, మానవ హక్కుల ఉల్లంఘన.. ఇలా అనేక అంశాలకు వ్యతిరేకంగా కొనసాగాయి ఆందోళనలు. తాత్కాలిక వలసదారులకున్న చట్టపరమైన హోదాను రద్దు చేయడం, వారిని బహిష్కరించడంపై ఆందోళనకారులు మండిపడ్డారు.

లక్షల మందికి ఉద్యోగాలు లేకుండా చేశారని ఫైర్

ఏప్రిల్ 5న కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈసారి కూడా అదే విధంగా కొనసాగాయి ర్యాలీలు. సామాన్య పౌరులతో పాటు.. విద్యార్థులు, ఉద్యోగులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వీరంతా ఇప్పుడు ట్రంప్ విధానాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ట్రంప్ టారిఫ్ విధానాలతో మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందని.. లక్షల మందికి ఉద్యోగాలు లేకుండా చేశారని ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భావ ప్రకటన స్వేచ్చకు, మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని.. ట్రంప్ వలస విధానాల కారణంగా మత, జాతి ఆధారంగా ప్రజలపై ముద్రపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ట్రంప్ న్యాయవ్యవస్థను అణిచే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మస్క్‌కు వ్యతిరేకంగా కూడా గొంతెత్తున్నారు అమెరికన్లు

లెటెస్ట్‌గా జరిగిన ఆందోళనల్లో నిరసనకారులు ఎలాన్‌ మస్క్‌ను కూడా టార్గెట్ చేసుకున్నారు. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న డోజ్‌.. ఫెడరల్ ఏజెన్సీల్లో విధిస్తున్న భారీ కోతలపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ప్రయత్నాలన్నీ పన్ను చెల్లింపుదారులకు బిలియన్లకొద్దీ డాలర్లు ఆదా చేస్తుందని చెబుతున్నా.. చాలా మంది అమెరికన్లు ఈ చర్యలను సమర్థించడం లేదు. ముఖ్యమైన సేవలను నిర్వీర్యం చేస్తున్నట్లుగానే చూస్తున్నారు. అందుకే మస్క్‌కు వ్యతిరేకంగా కూడా గొంతెత్తున్నారు అమెరికన్లు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నదే తమ సంకల్పమని

నిరసనకారులు మాత్రం ట్రంప్ విధానాలను మార్చుకోవాల్సిందేనని పట్టుపడుతున్నారు. తాము ఏ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేయడం లేదని.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నదే తమ సంకల్పమని చెబుతున్నారు తమ నిరసన కూడా శాంతియుతంగానే కొనసాగుతుందంటూ క్లారిటీ ఇచచారు. తమ డిమాండ్ ఒకటే అని ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇస్తూ.. రాజ్యాంగం ప్రకారం పనిచేసే ప్రభుత్వం కావాలంటున్నారు.

ఈ ఆందోళనలు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో

నిజానికి అమెరికా లాంటి అగ్రరాజ్యంలో నిరసనలు జరగడం చాలా అరుదు. 2017 తర్వాత అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఇదే తొలిసారని చెప్పాలి. ఓవరాల్‌గా చూస్తే అమెరికా వ్యాప్తంగా సాగిన ఈ ఆందోళనలు, జనం నుంచి వ్యక్తమైన ఆగ్రహావేశాలు చూస్తుంటే ట్రంప్ పాలనపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని స్పష్టంగా చెబుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే.. ఈ ఆందోళనలు రోజురోజుకు పెరిగేలానే కనిపిస్తున్నాయి. మరి ట్రంప్ నిర్ణయాలపై ఈ ఆందోళనలు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో చూడాలి.

ఈ నిరసనలతో ట్రంప్ ఫ్యూచర్ ఏమైనా మారబోతుందా?

ఫిఫ్టీ ఫిఫ్టీ వన్.. ఇప్పుడీ నెంబర్ అమెరికాలో చాలా ఫేమస్. ఇంతకీ ఈ నెంబర్ స్పెషాలిటీ ఏంటి? ట్రంప్ నిరసనలకు.. ఈ నెంబర్‌కు లింకేంటి? ఈ నిరసనలతో ట్రంప్ ఫ్యూచర్ ఏమైనా మారబోతుందా?

అమెరికా వ్యాప్తంగా 400 ప్రాంతాల్లో ఈ నిరసనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనల్లో ప్రముఖంగా వినిపిస్తున్న నంబర్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్. 50 రాష్ట్రాల్లో 50 నిరసనలు.. ఐక్య ఉద్యమానికి ప్రతీకగా నిరసనలు చేపట్టారు. 50501 వాలంటీర్ టీమ్‌ ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. అమెరికా వ్యాప్తంగా 400 ప్రాంతాల్లో ఈ నిరసనలు ప్లాన్ చేశారు. సక్సెస్ కూడా చేశారు.

హ్యాండాఫ్ పేరుతో నిరసనలు చేస్తున్న అమెరికన్లు

ఇప్పటికే హ్యాండాఫ్ పేరుతో నిరసనలు చేశారు అమెరికన్లు. ఆ సమయంలో మొత్తం 1200 ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఇప్పుడుఆ స్థాయిలో కాకపోయినా నిరసనలు మాత్రం జరిగాయి. రీసెంట్‌గా F-1 విద్యార్థి వీసా ముగిసినా అమెరికాలోనే ఉంటున్న పాలస్తీనా స్టూడెంట్ లెకా కోర్డియాను అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ స్టూడెంట్‌ను రిలీజ్ చేయాలన్న డిమాండ్స్ పెరిగాయి. అదే సమయంలో మరో పాలస్తీనా స్టూడెంట్‌ను కూడా రిలీజ్ చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు.

ట్రంప్‌పై తీవ్ర విమర్శలు

ట్రంప్ తీసుకుంటున్న ని789ర్ణయాలపై అక్కడి యూనివర్సిటీలు కూడా గుర్రుగా ఉన్నాయి. ట్రంప్ ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి 2.3 బిలియన్ డాలర్ల ఫండ్‌ను నిలిపివేశారు. ఇది కాస్త ట్రంప్‌పై తీవ్ర విమర్శలకు దారి తీసింది. కీలకమైన పరిశోధనలకు ఈ నిధులు ఉపయోగపడతాయి. ఒక్క యూనివర్సిటీకే కాకుండా.. దానికి అనుబంధంగా ఉండే హాస్పిటల్స్, పరిశోధనా సంస్థలపై కూడా ప్రభావం చూపుతుంది.

హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికన్ ప్రభుత్వానికి మధ్య వివాదం

ఇప్పుడే కాదు బైడెన్ హయాంలో కూడా హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికన్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగింది. యాంటీ సెమిటిజం, ప్రో పాలస్తీనా నిరసనలను కంట్రోల్ చేయడం లేదనేది వివాదానికి కారణమైంది. దీనికి హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్‌కు ఘాటుగా సమాధానం ఇవ్వడంతో అగ్గికి ఆజ్యం పోసినట్టైంది. ట్రంప్ యూనివర్సిటీలపై తీసుకున్న తాజా నిర్ణయాలపై కూడా తాజా నిరసనల్లో తీవ్ర విమర్శలకు కారణమైంది.

సుంకాల ప్రభావంతో.. అమెరికాలో వస్తువుల ధరలు పెరిగే అవకాశం

ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ.. నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్‌లు.. ఆర్థిక మాంద్యం వైపు దారితీసే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావంతో.. అమెరికాలో వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై విధించే పన్నులు, కొత్త సుంకాలు.. వస్తువుల ధరలను పెంచుతాయి. సుంకాల ద్వారా అయ్యే అదనపు ఖర్చు భారాన్ని.. కంపెనీలు వినియోగదారుల మీదే మోపుతాయి.

భవిష్యత్‌లో అమెరికన్ పౌరులకే శాపంగా మారుతుందా?

ఫలితంగా.. అమెరికా మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే అదనుగా.. స్థానిక ఉత్పత్తిదారులు కూడా ధరలను పెంచే పరిస్థితి నెలకొంది. ఇది అమెరికాలోని సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని మరింత పెంచనుందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు.. అంతర్జాతీయ వాణిజ్యంలోనూ అమెరికా ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా.. అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసమే చేస్తున్నానని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. అమెరికా ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మడం లేదు. ట్రంప్ టారిఫ్‌లు.. భవిష్యత్‌లో అమెరికన్ పౌరులకే శాపంగా మారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రేడ్ వార్, నిరుద్యోగం, ట్రంప్ తీసుకునే దుందుడుకు నిర్ణయాలపై అమెరికా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ట్రంప్ పాలన ఇలాగే కొనసాగితే మాత్రం.. ప్రజలు వీధుల్లో నిరసనలతోనే ఆగిపోయే అవకాశం ఉంటుందా? అనేది ఇప్పుడు కాలమే నిర్ణయించాలి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×