Illu Illalu Pillalu Today Episode April 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి తన తల్లిదండ్రులను వదిలేసి వస్తున్నందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. చందు ఎంత ఓదార్చినా తను కంట్రోల్ అవ్వదు. కామాక్షి మాత్రం నువ్వేమీ వేరే దేశానికి వెళ్ళట్లేదు ఇదే ఊర్లోనే మీ అమ్మానాన్న ఉంటారు. నువ్వు ఎప్పుడు కాబట్టి అప్పుడు వెళ్లేసి రావచ్చు అని అంటుంది. ఇక సాగర్ నువ్వు అలా ఏడవకు వదిన నువ్వు ఏడుస్తుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక కారులో సరదాగా ఉండాలని పాటలు పెడతాడు. సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు వస్తున్నాయి అనగానే శ్రీవల్లిని ఇంకా బాధ పెడతాయి.. ఇక కామాక్షి గోల భరించలేక సాగర్ పాటలు ఆపేస్తాడు. ఇక కోడళ్లు ఇద్దరు కలిసి హారతి ఇచ్చి శ్రీవల్లి ని ఇంట్లోకి తీసుకొస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి నా కోడళ్లు ఇస్తారులే అని వాళ్ల మధ్య పుల్ల పెడుతుంది. ఈమె చేసేవన్నీ ఇలాంటి వంకరపనులే. సాంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడుచే హారతి ఇస్తుంది. కానీ.. వేదవతి మాత్రం కోడళ్లతో హారతి ఇప్పిస్తుంది. నేను ఈ ఇంటి ఆడబిడ్డని నేను కదా హారతి ఇవ్వాలి.. వాళ్లని ఇవ్వమంటావ్ ఏంటి? కడిగిపారేస్తుంది కూతురు కామాక్షి. ఒసేయ్ వాళ్లు ఈ ఇంటి కొడళ్లే.. తోడుకోడళుకి హారతి ఇస్తే బావుంటుంది అని ఫిటింగ్ పెడుతుంది వేదవతి. లేదు లేదు.. నేను ఒప్పుకోను.. ఇంటి ఆడపడుచుగా నేనే హారతి ఇస్తాను అని మొండికేస్తుంది కామాక్షి..
హారతి ఇచ్చిన తరువాత ప్లేట్‌లో డబ్బులు వేస్తారు కదా.. మరి అవి ఎవరికి ఇస్తారు? అని అడుగుతుంది కామాక్షి. దానికి అంతా పెద్దగా నవ్వుకుని.. నువ్వు సూపరెహే.. హారతి ఇస్తానంటే వాళ్లపై ప్రేమతో అనుకున్నా.. ఆ డబ్బులపై ప్రేమతోనా? .. ఆ డబ్బులు నువ్వే తీసుకుందువులే కానీ.. హారతి ఇవ్వనువ్వు అని అంటాడు రామరాజు. దాంతో సరేనని అంటుంది కామాక్షి. ఆ తరువాత ఇద్దరు కోడళ్లు.. కొత్త కోడలికి హారతి ఇచ్చి లోపలికి తీసుకురావాలని అనుకుంటారు. కానీ కామాక్షి మాత్రం పేర్లు చెప్పేవరకు లోపలికి రానివ్వను అని అంటుంది. మొత్తానికి శ్రీవల్లి చందు పేరు చెప్పడానికి తెగ సిగ్గు పడిపోతుంది. అందరూ కలిసి శ్రీవల్లిని ఒక ఆట ఆడుకుంటారు.
శ్రీవల్లి సిగ్గుపడే సీన్ అయితే హైలైట్ అంతే. ఆ తంతు ముగిసిన తరువాత.. అత్తారింట్లో కుడికాలు పెట్టేస్తుంది శ్రీవల్లి. ఇక ఈ పెళ్లి తంతు అంతా చూసిన తరువాత.. ప్రేమ, నర్మదలు మళ్లీ ఎమోషనల్ అవుతారు. ఇంతగొప్ప సంతోషాన్ని మేం కోల్పోయాం అని మళ్లీ బాధపడతారు. తమ పెళ్లిళ్ల విషయంలో జరిగిన గొడవల్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు.. రామరాజు మాత్రం విశ్వం చేసిన పనికి తలుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి మరి బయటికి వస్తాడు. నా పెద్ద కొడుకు పెళ్లి ని ఆపేయాలని చూస్తావా నీకు కొంచమైన బుద్ధుందా? ఎన్ని రోజులు మన మధ్య గొడవలు ఉన్నాయని అనుకున్నాను కానీ నా పిల్లలు సంతోషాన్ని నువ్వు దూరం చేస్తావా అసలు నేను ఈరోజు బ్రతకనివ్వను అని రామరాజు గొడవకు దిగుతాడు.
ఇక మధ్యలో వాళ్లంతా కల్పించుకొని రామరాజు నుంచి విశ్వం ను విడిపిస్తారు. మధ్యలో ప్రేమ వచ్చి మామయ్య నా మొహం చూసి ఆపండి మావయ్య అనేసి అడుగుతుంది. రామరాజు నా కోడలు మొహం చూసి నిన్ను వదిలి పెడుతున్నాను ఇంకొకసారి నా బిడ్డల జోలికి వస్తే మీ అంతు చూస్తానని విశ్వంకి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అందరూ సరదాగా భోజనం చేస్తూ ఉంటే శ్రీవల్లి మాత్రం కింద కూర్చొని భోజనం చేస్తే బాగుంటుందని అంటుంది.. అక్కడితో తో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో శ్రీవల్లి తోడికోడళ్ల మధ్య గొడవలు పెడుతుంది. ప్రేమ వల్లే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని మొహాన్ని అనేస్తుంది. దానికి ప్రేమ కన్నీళ్లు పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..