BigTV English

Japan Airlines Flight: అభ్యర్థనలు.. ఆర్తనాదాలు.. నిజంగా అదో మిరాకిల్..

Japan Airlines Flight: అభ్యర్థనలు.. ఆర్తనాదాలు.. నిజంగా అదో మిరాకిల్..
Live tv news telugu

Japan Airlines Flight(Live tv news telugu):

అన్నివైపుల నుంచి కమ్మేస్తున్న పొగ.. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రయాణికుల్లో ఒకటే ఆందోళన. ఎవరికి వారు త్వరగా విమానం దిగేయాలనే ఆత్రుత. ‘ప్లీజ్.. నన్ను వెళ్లనివ్వండి..’ అంటూ ఓ మహిళ ఆర్తనాదం. ‘తలుపులు ఎందుకు తెరవడం లేదు?’ మరో పిల్లాడు ఏడుస్తూనే గట్టిగా అరుస్తున్నాడు. ప్రమాదానికి గురైన సమయంలో జపాన్ ఎయిర్ లైన్స్ విమానంలో పరిస్థితి ఇది. చాలా మంది ఇక బతకడం కల్ల అనే అనుకున్నారు.


ఈ దుర్ఘటనలో జేఎల్ 516 విమానంలోని మొత్తం 379 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడటం ఓ మిరాకిల్. టోక్యోలోని హనెడా విమానాశ్రయం రన్‌వేపై కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టిన అనంతరం మంటలు చెలరేగాయి. అగ్నిగోళంలా మారిన ఎయిర్‌బస్ ఏ350 ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి సురక్షితంగా బయటపడటం ఓ అద్భుతమేనని ప్రయాణికులు చెబుతున్నారు. విషాదకరం ఏమిటంటే కోస్టుగార్డు విమానానికి చెందిన ఆరుగురు సిబ్బందిలో అయిుదుగురు మరణించారు.

కోస్ట్‌గార్డు విమానం చాలా చిన్నది. లాండింగ్‌కు జేఎల్ 516 కెప్టెన్ అనుమతి పొందినా.. రన్‌వేపై ఉన్న చిన్నదైన కోస్ట్‌గార్డ్ విమానాన్ని అతను గమనించలేదని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. విమానాలు ఢీకొట్టడానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోంది. విమానాలు పెద్ద శబ్దంతో ఢీకొన్న వెంటనే ప్రయాణికుల్లో కలకలం మొదలైంది.


కంగారుపడొద్దు.. సహకరించండంటూ ఫ్లైట్ అటెండెంట్స్ అభ్యర్థించడం వీడియోల్లో రికార్డయింది. తోకభాగంలో మొదలైన మంటలు క్రమేపీ విమానం అంతటా వ్యాపించాయి. అప్పటికే సిద్ధమైన 115 ఫైర్ ఫైటింగ్ యూనిట్లు వాటిని ఆర్పే ప్రయత్నాల్లో మునిగిపోయాయి. మరోవైపు విమాన సిబ్బంది ప్రయాణికులను చకాచకా బయటకు పంపడంలో కృతకృత్యులు కాగలిగారు. ఎవాక్యుయేషన్ ప్రక్రియ మొత్తం 20 నిమిషాల్లోనే పూర్తి కాగలిగిందంటే.. అందుకు కారణం సిబ్బంది మెరుపువేగమే.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×