BigTV English

Monkeypox Case: పాకిస్థాన్‌లో ముగ్గురికి మంకీపాక్స్‌ పాజిటివ్.. భయాందోళనలో పొరుగు దేశాలు.. లక్షణాలు ఇవే!

Monkeypox Case: పాకిస్థాన్‌లో ముగ్గురికి మంకీపాక్స్‌ పాజిటివ్.. భయాందోళనలో పొరుగు దేశాలు.. లక్షణాలు ఇవే!

Pakistan has Confirmed its first monkeypox case: పాకిస్థాన్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇటీవల సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ముగ్గురికి పాజిటివ్ గా తేలింది. ఆగస్టు 3న పాకిస్థాన్‌లో మార్డన్ నివాసులు ముగ్గురు అడుగుపెట్టారు. అయితే వీరు అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలింది. ఈ మేరకు ఆ ముగ్గురు మంకీపాక్స్ బారినపడినట్లు ఆగస్టు 13న పెషావర్‌లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ ధ్రువీకరించింది.


సౌదీ అరేబియా నుంచి వారితోపాటు విమానంలో కలిసి వచ్చిన తోటి ప్రయాణికుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ ముగ్గురితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు ట్రేసింగ్ ప్రారంభించారు. విమానంలో ప్రయాణించిన కొంతమందితోపాటు సన్నిహితులను గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. అయితే, దేశంలో మూడు మంకీపాక్స్ కేసులు నమోదు కావడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది.

2023లోనూ కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులకు మంకీపాక్స్ పాజిటివ్ రావడంతో వారికి వైద్య సేవలు అందించారు. ఇది అంటువ్యాధి కావడంతో ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే ఏడాది దాదాపు 11 కేసులు నమోదైతే..ఇందులో ఒకరు మృతి చెందారు.


ఇదిలా ఉండగా, ఈ మంకీపాక్స్..122 దేశాల్లో 99,518 కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కేసులు రోజురోజుకు పెరగడంతో ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది. వేగంగా వ్యాధి చెందడంతో అరికట్టేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఆఫ్రికా దేశల్లో విజృంభించింది. దీంతో అక్కడ హెల్త్ ఎమర్జెనీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read:  బంగ్లాదేశ్‌ సంక్షోభం.. టార్గెట్ హిందూవులేనా?

మంకీపాక్స్ వ్యాధి సంక్రమిస్తే..విపరీతమైన తలనొప్పితోపాట జ్వరం, ఒళ్లునొప్పులు, పాదాల్లో దురద, పొక్కులు ఉంటాయి. అలాగే అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. దద్దుర్లు నొప్పిని కలిగిస్తాయి. కళ్లు, నోరు, మల, మూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి. దీంతోపాటు నీటి బొడిపెలుగా మొదలై ఎరుపు, నలుపు రంగులోకి మారిపోతాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×