BigTV English

ISRO launches SSLV-D3: SSLV-D3 రాకెట్ ప్రయోగం సక్సెస్.. ఈ ఉపగ్రహంతో కలిగే ప్రయోజనాలివే..

ISRO launches SSLV-D3: SSLV-D3 రాకెట్ ప్రయోగం సక్సెస్.. ఈ ఉపగ్రహంతో కలిగే ప్రయోజనాలివే..
ISRO Successfully Launches SSLV-D3 Mission: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోట షార్‌ నుంచి SSLV-D3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం సరిగ్గా 9 గంటల 17 నిమిషాలకునిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి వెళ్లింది. 17 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా.. 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్‌ ప్రకటించారు. పర్యావరణం, ప్రకృతి విపత్తులను పర్యవేక్షణ టార్గెట్ గా సైంటిస్టులు ఈ మిషన్ ను ప్రవేశపెట్టారు.
ఈ ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్ బరువు 119 టన్నులు, ఎత్తు 34 మీటర్లు, వెడల్పు 2 మీటర్లుగా ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి 475 కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్‌ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు. ఈవోఎస్-08 శాటిలైట్ బరువు 175.5 కిలోలు. ఇక ఈ శాటిలైట్‌లో మూడు పే లోడ్స్‌ని ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. అవి ఎలక్ట్రో ఆప్టికల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ , పేలోడ్‌ మిడ్‌-వేవ్, లాంగ్‌ వేవ్‌ ఇన్‌ఫ్రా-రెడ్‌లు.. ఇవి భూమికి సంబంధించిన చిత్రాలను క్యాప్చర్‌ చేస్తుంది. అలాగే ఇవి తీసిన పిక్స్ ని పరిశీలించి వాతావరణం పరిస్థితులు, విపత్తులపై అధ్యయనం నిర్వహిస్తారు.
ఈ ఉపగ్రహం ఏడాది పాటు సేవలను అందజేయనుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. అంతేకాదు, ఇది SSLV ప్రాజెక్ట్‌కు అవకాశాలను తీసుకొస్తుందని, సరికొత్త మిషన్లకు శ్రీకారం చుడుతుందని ఇస్రో చెబుతోది. పీఎస్ఎల్వీ ప్రయోగాలకు ఎక్కు సమయం, ఖర్చు కూడా అధికమే. కానీ, ఎస్ఎస్ఎల్వీ చాలా ప్రత్యేకమైనది. తక్కువ ఖర్చు, సమయం, పరిమిత మానవవనరుల సాయంతో కేవలం 72 గంటల వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు.
ఇది ఇస్రో వాణిజ్య ప్రయోగాలను మరింత రెట్టింపు చేయగలదని భావిస్తున్నారు. దీనివల్ల ప్రపంచ అంతరిక్ష వాణిజ్యంలో ఇండియా వాటా పెరుగుదలకు తోడ్పడుతుంది. కాగా, 2022లో తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యల తెలుసుకొని 2023లో మరో ప్రయోగం నిర్వహించి సక్సెస్ అయింది.

 


Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×